కాకినాడ: శనివారం రాత్రి కాకినాడ స్పందన హాలులో జరిగిన తూర్పు గోదావరి జిల్లా అధికారుల సంఘం ప్రధమ సమావేశంలో ఆయన వివిధ గజల్స్‌ను పాడి వినిపించారు. నేడు నానాటికీ తగ్గిపోతున్న మానవ సంబంధాల గురించి, అమ్మ ప్రేమ ఎంత గొప్పదో తన గజల్స్ పాటల ద్వారా ఆలపించి తెలిపారు. అంతే గాక జన్మభూమి, బాల్యం గొప్పదనం, చిన్ననాటి స్నేహితులు, వారితో గల అనుబంధం వంటి విషయాలను కూడా తన గజల్స్ ద్వారా వివరించారు. అలాగే గ్రామ సీమలు, పట్టణాలకు మధ్య గల తేడాలను తన పాటల ద్వారా వివరించారు. ప్రతి ఒక్కరూ అమ్మ ప్రేమను మరువరాదని గజల్ శ్రీనివాస్ ఈ సందర్భంగా సూచించారు. అనంతరం ఇటీవల ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా నియమితులైన డాక్టర్ ఐ.వి.రావును జిల్లా కలెక్టర్ ఎం.రవిచంద్ర, ఎస్.పి. జి.శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ కె.శశిధర్, అడ్మిన్ ఎస్.పి. ఎస్.జె.జనార్థన్ తదితరులు దుశ్శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. తదుపరి గజల్ శ్రీనివాస్‌ను కూడా ఇదే విధంగా వారు సత్కరించారు. అంతకు ముందు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఐ.టి.డి.ఎ. పి.ఓ. రోనాల్డ్ రాస్, వాణిజ్య పన్నుల శాఖ ఉప కమీషనర్ యోగితారాణా, జిల్లా అధికారుల సంఘం గౌరవాధ్యక్షులు, అదనపు జె.సి. బి.రామారావు, అధ్యక్షులు డి.ఆర్.ఓ. ఎస్.వెంకట్రావు, ఇంకా జిల్లా అధికారుల సంఘం కార్యవర్గసభ్యులు, అందరు జిల్లా అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Filed under: వార్తలు





tq sir chalabagundi