మెదక్: సమస్యల పరిష్కారం కోసం పరిశ్రమల కాంట్రాక్టు కార్మికులు మెదక్ జిల్లా వ్యాప్తంగా నేడు సమ్మె చేపట్టారు. దీంతో పలు పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కనీస వేతనాలు అమలు చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్, సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పటాన్‌చెరులో పెన్నార్ పరిశ్రమ వద్ద యాజమాన్యానికి, సీఐటీయూ నాయకులకు కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపు చేశారు.
Filed under: వార్తలు | Leave a Comment »




