కడప: గ్రూప్-4 ఉద్యోగాలకు ఉచిత శిక్షణకు వెనకబడిన తరగతుల (బిసి, ఎస్సీ, ఎస్టీ) అభ్యర్దుల నుండి ఎపి స్టడి సర్కిల్ ఫర్ బి.సీస్ కడప వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గతంలో వెలువడిన గ్రూప్-4 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసి రిసిప్ట్ కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. శిక్షణ కాలం రెండు నెలలు. శిక్షణ కాలంలో స్టైఫండ్ నెలకు రూ.750/-, స్టడీ మెటీరియల్‌కు ప్రతి విద్యార్థికి రూ.800/- ఇవ్వడం జరుగుతుందని, మొత్తం సీట్ల సంఖ్య 50(బిసి-33,ఎస్సీ-10,ఎస్టీ-7) ఉన్నట్లుగా తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలు కలిగిన బయోడేటా ఫారంను ఈ క్రింది పేర్కొనబడిన జిరాక్స్ కాపీలను మాత్రమే జతచేయవలెను. యస్.యస్.సి మార్కులిస్ట్, ఇంటర్/ డిగ్రీ మార్కుల జాబితా. కులదృవీకరణ పత్రము,నివాస పత్రము, ఎపిపిఎస్సీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన రిసిప్ట్, రూ.6 పోస్టల్ స్టాంప్ అంటించిన మీ సొంత చిరునామా కలిగిన కవరు (అభ్యర్థుల ఫోన్ నెంబరు తప్పనిసరిగా వ్రాయాలి) జత చేయవలెను. పూర్తిచేసిన దరఖాస్తు ఫారంను ఎపి స్టడీ సర్కిల్ ఫర్ బిసిస్, ఓల్డ్ రిమ్స్ (కేంద్రీయ విశ్వవిద్యాలయం దగ్గర) కడప,వైఎస్‌ఆర్ జిల్లా 516002 నందు గల మా కార్యాలయానికి నేరుగా గాని, లేదా పోస్ట్ ద్వారా కాని దరఖాస్తులు 30వ తేదీ నుండి ఆగస్టు 7వతేదీ ఉదయం 10గంటల నుండి 5గంటల లోపు అందజేయగలరు. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని డైరెక్టర్ ఆర్.సమ్మయ్య ఎపి స్టడీ సర్కిల్ ఫర్ బీసీస్ ఒక ప్రకటనలో తెలిపారు.
Filed under: వార్తలు




