తొలి తెలుగు గిరిజన దినపత్రిక మన్యసీమ

31-07-2010

పనులు వేగవంతం చేయండి: ఖాన్‌ ఆదేశాలు

కర్నూలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని రాజీవ్‌ విద్యా మిషన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి చందనాఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్‌లోని సమావేశ మందిరంలో సర్వశిక్ష అభియాన్‌ పనితీరు, విద్యా హక్కు చట్టం, సాక్షరభారత్‌ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చందనాఖాన్‌ మాట్లాడుతూ విద్యాలయాల్లో గదుల కొరత వల్ల పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, యుద్ద ప్రాతిపదికన అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని, సకాలంలో త్వరితగతిన [...]

మంచిర్యాలలో అరవింద్‌, సిర్పూర్‌లో సమ్మయ్య

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి కావేటి సమ్మయ్య విజయం సాధించారు. ఇక్కడ మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఇంద్రకిరణ్‌ రెడ్డి ఆధిక్యం సాధించినా అనంతరం అన్ని రౌండ్లలో తెరాస ఆధిక్యం సాధించింది. కాగా, ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో తెరాస అభ్యర్ధి గడ్డం అరవిందరెడ్డి సమీప కాంగ్రెస్‌ అభ్యర్ధి ఆర్‌.కృష్ణారావుపై విజయం సాధించారు. కరీంనగర్‌ జిల్లా వేములవాడ నియోజకవర్గంలో తెరాస అభ్యర్ధి చెన్నమనేని రమేష్‌ విజయం సాధించారు. [...]

వైఎస్సార్‌ ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవి

హైదరాబాద్‌: దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలు ఇలా ఉండేవి కావని కాంగ్రెసు బహిష్కృత నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మహానాయకుడు వైఎస్‌ లేని లోటు తెలంగాణ ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. త్వరలో తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ తెలంగాణలో పర్యటిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రచారం కూడా చేయలేదని ఆయన అన్నారు. రెండు ప్రాంతాలు [...]

టిఆర్‌ఎస్‌ గెలుపుపై హర్షం సీమాంధ్రుల హర్షం

కర్నూలు: శుక్రవారం తెలంగాణ ప్రాంతాల్లో ఉప ఎన్నికల్లో వెలువడిన ఫలితాల మేరకు కేంద్ర కాంగ్రెస్‌ అధినేతల నాయకులలో మార్పు రావాలని రాయలసీమ తెలంగాణ ఉత్తరాంధ్ర వ్యవస్దాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన తెలుపుతూ రాజీనామాలు చేసిన వారే తిరిగి గెలుపొందడం తెలంగాణా ప్రజల విజయం అని, కాబట్ట అభివృద్ది పై దృష్టి పెట్టక పోవడమే వల్లే ఉప ఎన్నికల ఫలితాలను తెలంగాణాపై రిఫరెండంగా భావించాలని ఆయన అన్నారు. [...]

చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స

కడప: పేదలకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించి వారికి అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నా అందులో ఏ మాత్రం మార్పుకనిపించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదలకు అందుబాటులో వైద్యం కల్పించాలని ప్రభుత్వం స్పందించినా అవి ఏవీ ఇక్కడ లేకపోవడం అందరిని బాధిస్తోంది. కనీస సౌకర్యాలు కూడా లేక పోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. [...]

కేసీఆర్‌తో చర్చలకు సిద్ధమన్న లగడపాటి

న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుతో చర్చలు జరిపేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నట్టు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ప్రకటించారు. ఈ సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని భావించామన్నారు. అయితే, తెలంగాణ సెంటిమెంట్‌కు ఆ ప్రాంత ప్రజలు పట్టం కట్టారన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఒక ప్రైవేట్‌ టీవీ ఛానెల్‌ నిర్వహించిన సర్వే ప్రకారం ఫలితాలు రావడం మంచిదే అయినప్పటికీ ఒక కాంగ్రెస్‌ [...]

ఈ విజయం అమరవీరులకు అంకితం: హరీష్‌

హైదరాబాద్‌: తమకు లభించిన విజయం తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ప్రజలకు అంకితమిస్తున్నట్టు సిద్ధిపేట తెరాస అభ్యర్ధి హరీష్‌రావు ప్రకటించారు. తన ప్రత్యర్ధి శ్రీనివాస్‌ రెడ్డి(కాంగ్రెస్‌)పై ఆయన 93,858 ఓట్ల తేడాతో విజయం సాదించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు మాత్రమే కాకుండా, తెరాస అభ్యర్ధులకు లభించిన విజయం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలవిజయమన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన బిడ్డలను గెలిపించాలన్న ఏకైక పట్టుదల ప్రజల్లో ఉండటం వల్లే తాము ఇంత భారీ మెజార్టీతో [...]

తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తాం: సీఎం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తామని ముఖ్యమంత్రి కె.రోశయ్య పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో సచివాలయానికి వచ్చిన ఆయన కొంతసేపు ఫలితాలను తెలుసుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి ప్రజల తీర్పును గౌరవిస్తున్నామనే ఏకవాక్య ప్రకటనను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

ఆదిలాబాద్‌ జిల్లాలో వరదనీటి ఉధృతి

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో వరదనీటి ఉధృతి పెరిగింది. దుబ్బార్‌పేట వద్ద వరదనీటిలో ఓ కారు చిక్కుకుని పోయింది. దీంతో అందులోని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇచ్చోడ మండలంలో కూడా వరదనీరు ఉధృతి ఉంది.

Follow

Get every new post delivered to your Inbox.