ఐబీ హెచ్చరికలు… హైదరాబాద్‌ బీ కేర్‌ఫుల్‌

హైదరాబాదు : నగరంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే ఐబీ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాదు పోలీసు కమిషనర్‌ ఏకే ఖాన్‌ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రి రోశయ్యతో సమావేశమై చర్చించారు. హైదరాబాదుకు నూరుశాతం రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని సూచించారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు వ్యక్తులెవరైనా అనుమానంగా సంచరిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. హైదరాబాదులోని షాపింగ్‌మాల్స్‌, సినిమాథియేటర్లు, పెద్దపెద్ద వాణిజ్య సెంటర్ల [...]

ఇద్దరు ఐఏఎస్‌, ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాదు: రాష్టంలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సాధారణ పరిపాలన శాఖ స్పెషల్‌ ఛీఫ్‌ పెక్రటరీగా భలేరావు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శశిక్‌జమాన్‌, ఆక్టోపస్‌ ఎస్పీగా మురళీకృష్ణ, హోంగార్డ్‌ కమాండెంట్‌గా వేణుగోపాల్‌రావు, గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డిజీగా అనురాగ్‌శర్మ, పోలీస్‌ ట్రైనింగ్‌ ఐజీగా వినయ్‌ రంజన్‌, హైదరాబాదు జాయింట్‌ కమీషనర్‌గా కృపానంద త్రిపాటి ఉజాల లునియమితులయ్యారు

అగ్నిమాపక శాఖలో 1790 పోస్టుల భర్తీ : సీఎం

హైదరాబాదు: అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్న 1790 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు సీఎం రోశయ్య అధికారులను ఆధేశించారు. ప్రతీ 50వేల మంది ప్రజలకు ఒక ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. అగ్నిమాపక శాఖను బలోపేతం చేయడానికి ప్రపంచ బ్యాంకు నుండి రూ. 200 కోట్ల రుణం తీసుకోవాలని ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిపారు.

7 లక్షల మంది మహాకుంభ స్నానాలు

హరిద్వార్‌: మహాకుంభమేళా ఆఖరిస్నానాల సందర్భంగా సుమారు 7లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. వైశాఖి అధికమాసం పూర్ణిమ సందర్భంగా ఇప్పటివరకు 7 లక్షల మంది స్నానాలు చేశారని కుంభమేళా ఎస్‌పి అజయ్‌ జోషి చెప్పారు. విస్తృత సెక్యూరిటీ ఏర్పాట్ల మధ్య 13 అఖారాలకు చెందిన సాధువులు సన్యాసులు హర్‌-కీ-పౌరి బ్రహ్మకుండానికి చేరారు. సాంప్రదాయకంగా వైష్ణవ సాంప్రదాయానికి చెందిన అఖారా బైరాగులు వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్నానాలు చేస్తారని కాని ఈ పర్యాయం అన్ని 13 సాంప్రదాయాలకు చెందిన [...]

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

కట్న వేధింపుల కేసులో జమున అల్లుడు

హైదరాబాద్‌: అదనపు కట్నం కోసం తన భార్యను మానసికంగా, భౌతికంగా హింసించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న నిన్నటితరం నటి జమున అల్లుడు రాహుల్‌ రెడ్డిని ఖైదు చేశారు. తన భర్త రాహుల్‌రెడ్డి, అతని తల్లిదండ్రులు అదనపు కట్నంకోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ నటి జమున కుమార్తె స్రవంతి ఏప్రిల్‌ 15వ తేదీన సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ (సిసిఎస్‌) పోలీసులవద్ద కేసు పెట్టారు. సిసిఎస్‌లోని మహిళా రక్షణ విభాగం కేసు నమోదు చేసుకుని రాహుల్‌రెడ్డి తల్లిదండ్రులు మధుసూదనరెడ్డి, వసంతలను అదేరోజు ఖైదు [...]

పొత్తులుండవు: కెసిఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకోసం సుదీర్ఘ పోరుకు పార్టీ కార్యవర్గం సిద్ధంగా ఉండాలని, సంస్థాగతంగా, రాజకీయంగా పార్టీ పటిష్టంగా ఉంటే తప్ప తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరించేలా ఢిల్లీలోని నిర్ణేతలను ప్రభావితం చెయ్యడం సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తొమ్మిదవ ఆవిర్భావదినం పిలుపునిచ్చింది. రోజంతా జరిగిన చర్చల అనంతరం మాట్లాడిన తెరాస అధినేత చంద్రశేఖరరావు తెలంగాణ కోసం నిజామాబాద్‌ శాసనసభా స్థానాన్ని బిజెపి శాసనసభ్యుడు ఖాళీ చేసినందున అక్కడ తెరాస పోటీ చెయ్యదని ప్రకటించారు. మిగిలిని [...]

నకిలీ విశ్వవిద్యాలయాల హల్‌చల్‌

న్యూఢిల్లీ: దేశంలో గుర్తింపు లేని 200 ఉన్నత విద్యా సంస్థలు, 21 నకిలీ విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయని, వీటిల్లో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐబిఎస్‌), ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌ కూడా ఉన్నాయని, అఖిల భారత సాంకేతిక మండలి ఆమోదం లేకుండా వాటి ఇస్టానుసారం అవి కార్యకలాపాలు సాగిస్తున్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ లోక్‌సభలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు. గుర్తింపు లేని ఈ సంస్థలు సాంకేతిక, మేనేజ్‌మెంట్‌ కోర్సులలో శిక్షణ [...]

రాష్ట్ర ప్రభుత్వానికి పిండప్రదానం!

ఆదిలాబాద్: ట్రిపుల్‌ ఐఐఐటిలలో సీట్ల సంఖ్యను 50 శాతం తగ్గించినందుకు నిరసనగా ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో గోదావరి నది ఒడ్డున తెలుగునాడు విద్యార్ధుల సమాఖ్య (టిఎన్‌ఎస్‌ఎఫ్‌) రాష్ట్రప్రభుత్వానికి పిండప్రదానం చేసింది. సమాఖ్య కార్యకర్తలు ఐఐఐటి బాసర వద్ద శీర్షాసనాలు వేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.నరిసిరెడ్డి మాట్లాడుతూ నిధులు లేమి, మౌలిక వసతుల లేమిని కారణాలుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీట్లను తగ్గించిందన్నారు. విద్యాశాఖలో నిధులు లేనపుడు నలుగురు మంత్రులు దేనికని ఆయన [...]

మంత్రి జైపాల్‌ బంధువుపై భూకబ్జా ఆరోపణ

హైదరాబాద్‌: భూకబ్జాలకు పాల్పడేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చెయ్యాలని తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధ్యక్షుడు ఎన్‌ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పట్టుబట్టారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, గుంటూరు, కర్నూల్‌, అనంతపురం జిల్లాలకు చెందిన తన పార్టీ కార్యకర్తలతో ముచ్చటించిన చంద్రబాబు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నాయకులు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి బంధువు ఒకరు భూమిని ఆక్రమించుకున్నారని, ఆయన చర్యల్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేశారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన [...]

Follow

Get every new post delivered to your Inbox.