గుంటూరు: జిల్లాలో జరుగుతున్న ప్రజాపథం కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ బి.రామాంజనేయులు అన్నారు. శుక్రవారం పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం వెంకటక్రిష్ణాపురం గ్రామంలో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలలో ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుందన్నారు. నిరుపేద కూలీలకు పనులు కల్పించడం ద్వారా వారి ఆర్ధిక స్థితిగతులను మెరుగు పరచే పథకం జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకమని [...]
Filed under: వార్తలు | Leave a Comment »




