తెలుగు మాట్లాడినందుకు అర్థనగ్నంగా నిలబెట్టిన టీచర్

‌విజయవాడ: తెలుగులో మాట్లాడినందుకు ఓ చిన్నారిని అర్థనగ్నంగా నిలబెట్టిన సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. స్థానిక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న యామిని అనే విద్యార్థిని తెలుగులో మాట్లాడిందని టీచర్‌ అర్థనగ్నంగా నిలబెట్టింది. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు స్కూలు యాజమాన్యాన్ని నిలదీయడంతో విషయం బయటికి తెలిసింది. ఆ స్కూల్లో ఇదొక్కటే ఘటన కాదని, ఇంతకు ముందు కూడా ఇలాంటి దండన ఇచ్చారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు.

జగదీష్‌, రాంబాబులకు బెయిలు విచారణ వాయిదా

విశాఖ : జగదాంబ జగదీష్‌, రాంబాబుల బెయిలు విచారణ వాయిదా పడింది. మార్చి 2న ఈ బెయిలు విచారణ జరపనున్నట్లు విశాఖ కోర్టు తెలిపింది.

మార్చి మొదటి వారంలో హైదరాబాదుకు : శ్రీకృష్ణ

న్యూఢిల్లీ : వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాదుకు వెళ్తామని జస్టిస్‌ శ్రీకృష్ణ తెలిపారు. గురువారం ఢిల్లీలో శ్రీకృష్ణ కమిటీ భేటీ అయి పలు అంశాలపై చర్చించింది. వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాలను కలుసుకుంటామని, జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు కూడా రాశామని జస్టిస్‌ శ్రీకృష్ణ వివరించారు. వివిద వర్గాల ప్రజలనుంచి వచ్చిన అభిప్రాయాలను విశ్లేషించి నివేదికలో పొందు పరుస్తామని ఆయన చెప్పారు. ఒక మంచి పని చేస్తున్నపుడు విమర్శలు, ఆరోపణలు రావడం [...]

అంతా అధిష్టానమే చూసుకుంటుంది : డిఎస్‌

హైదరాబాదు: శ్రీకృష్ణ కమిటీకి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ తరపున నివేదిక ఇవ్వాల్సి వస్తే అదంతా అధిష్టానమే చూసుకుంటుందని పీసీసీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిన నిధుల వివరాలకోసం ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు సిఎంకు లేఖ రాయడం సముచితమేనని డిఎస్‌ చెప్పారు.

రాష్ట్రంపై ఈ సారి కాస్త దయతలచిన మమత

హైదరాబాదు : గత ఏడాది రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మమత ఈసారి కాస్త దయతలచారు. ఇది కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువేనని ప్రతిపక్షాలు అంటున్నాయి. సికింద్రాబాదులో రైల్వే వ్యాగన్‌ ఫ్యాక్టరీ, స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పలు కొత్త రైళ్లు, రైల్వే లైన్లను మమత ప్రకటించారు.

మమత బడ్జెట్‌ భేష్‌ : శాసనసభ డిప్యూటీ స్పీకర్‌

హైదరాబాదు : మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్‌ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని శాసనసభ డిప్యూటీ స్పీకరు నాదేండ్ల మనోహర్‌ అన్నారు. గతంతో పోలిస్తే ఈసారి రాష్ట్రానికి న్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీలందరూ పార్టీలకతీతంగా కేంద్రంపై ఒత్తిడి కొనసాగించాలని ఆయన కోరారు.

రైల్వే బడ్జెట్‌లో పారదర్శకత కొరవడింది : చంద్రబాబు

హైదరాబాదు : రైల్వే బడ్జెట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు పెదవి విరిచారు. పూర్తి పారదర్శకతతో బడ్జెట్‌ రూపొందించలేదని బాబు ఆరోపించారు. కేటాయింపుల్లో నిర్లక్ష్యం జరిగిందని, ప్రయోజనాలన్నీ సోనియా గాంధీ, మమతా బెనర్జీ పంచుకున్నారని వమిర్శించారు. రాష్ట్రానికి మేజర్‌ కోచ్‌ ఫ్యాక్టరీలు రాకపోవడంపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆరాష్ట్రానికే ప్రయోజనాలు దక్కుతున్నాయని, మన రాష్ట్రానికి కూడా లాభం చేకూరాలంటే మనవాళ్లకు ఐదేళ్లపాటు రైల్వే మంత్రి పదవి ఇవ్వాలని బాబు [...]

రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మమతా బెనర్జీ

న్యూఢిల్లీ : 2010-11 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను మంత్రి మమతా బెనర్జీ లోకసభలో ప్రవేశ పెట్టారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే మంత్రి బడ్జెట్‌ను సభకు చదివి వినిపించడం ప్రారంభించారు. యూపీఏ ప్రభుత్వంలో మమతకు ఇది రెండో రైల్వే బడ్జెట్‌. పార్లమెంటులో నాలుగో సారి మమత బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సారి బడ్జెట్‌లో కూడా రైల్వే ప్రయాణీకులపై భారం ఉండదని మమత తెలిపారు. బడ్జెట్‌ తయారీ కోసం సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ [...]

స్టాంపుల కుంభకోణం నిందుడు తెల్గీ కోర్టు హాజరు

విశాఖ: నకిలీ స్టాంపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడు తెల్గీని పోలీసులు విశాఖ కోర్టులో హాజరు పరిచారు. బెంగుళూరు జైల్లో ఉన్న అబ్దుల్‌ కరీం తెల్గీని విచారణలో భాగంగా పోలీసులు విశాఖ తీసుకువచ్చారు. 19 ఏళ్లుగా తెల్గీ జ్యూడిషియల్‌ కస్టడీలో ఉంటున్నాడు. దాదాపు రూ. 30 కోట్ల విలువైన నకిలీ స్టాంపుల కుంభకోణంలో తెల్గీ ప్రధాన నిందితుడు.

ఢిల్లీ -హౌరా ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

బీహార్‌ : ఓ వైపు లోకసభలో ప్రవేశపెట్టే రేల్వే బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తితో ఎదురు చూస్తున్న తరుణంలో రైలు దోపిడీ జరిగింది. ఢిల్లీ-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడి జరిగింది. దుండగులు లక్షన్నర రూపాయల సొత్తు దోచుకెళ్లారు. ఈ ఘటనపై ఆర్‌పిఎఫ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow

Get every new post delivered to your Inbox.