జైపూర్: ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్ 138 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 10 పరుగులకు సచిన్ వికెట్ కోల్పోయింది. నాలుగు పరుగులకే సచిన్ రనౌట్ అయ్యాడు. అనంతరం కార్తిక్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన సెహ్వాగ్ (46) కూడా 15వ ఓవర్‌లో రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మూడు ఓవర్లాడిన కార్తిక్ (44) సైతం క్యాచ్ అవుటయ్యాడు. ఆ తరువాత కెప్టెన్ ధోనీ సైతం వెంటనే క్యాచ్ ఔట్ కావడంతో భారత్ స్కోరు బోర్డు స్పీడు తగ్గింది. 24 వ ఓర్ నుంచి సురేష్ రైనా, విరాట్ కోహ్లీలు మ్యాచ్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు.
Advertisement
Filed under: వార్తలు




