మైనర్‌ బాలికపై అత్యాచార యత్నం

విశాఖ: సామాజిక సేవ ముసుగులో ఓ వృద్ధ జంభూకం మైనర్‌ బాలికపై అత్యాచార యత్నం చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటనకు విశాఖలోని ‘మామాహోం’ అనే స్వచ్ఛంధ సంస్థ వేదికైంది. ఇంతటి ఘనకార్యానికి పాల్పడిన సదరు వృద్ధ కామాంధుడిని చితక్కొట్టి బాలిక బంధువులు పోలీసులకు అప్పగించారు. పోలీష్ స్టేషన్ లో దర్జాగా కూర్చున్న ఇతడి పేరు వాసుదేవరావు..విశాఖలో ‘మామాహోం’ పేరిట ఓ స్వంచ్చంద సంస్థ నిర్వహిస్తున్న ఇతగాడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. అభం, శుభం తెలియని [...]

ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాదు: ఫిబ్రవరి 15 నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు నలభై రోజుల పాటు జరిగే సమావేశాల కోసం అధికారులు అసెంబ్లీని ముస్తాబు చేస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్న నేపధ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ధరల పెరుగుదల, శాంతిభద్రతల వైపల్యం, బడ్జెట్‌ పై చర్చ లాంటి అంశాలపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉందని అధికార, ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. వీటిపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అసెంబ్లీలో అనుకూల, [...]

చిన్నారులపై సుప్రీంకోర్టు ఆందోళన

హైదరాబాదు: దేశం చిన్నారుల వ్యభిచార కూపంగా మారుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అభం, శుభం తెలియని చిన్నారులను వ్యభిచార కూపంలోకి లాగుతున్న రాకెట్లను పట్టుకునేందుకు నడుం బిగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. చిన్నారులతో వ్యభిచారం చేయించే వారిపై నాన్‌ బెయిల్‌బుల్‌ సెక్షన్లు అమలు చేయాలని నిర్ణయించింది.

ట్రిబ్యునల్‌పై కోర్ట్‌లో అప్పీల్ చేయనున్నరాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాదు: డీజీపీగా గిరీష్‌కుమార్‌నే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు డీజీపీ నియామకం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్‌ చేయాలని నిర్ణయించింది. డీజీపీగా గిరీష్‌కుమార్‌ పదోన్నతి, బదిలీ చెల్లదంటూ క్యాట్‌ సంచలన తీర్పునివ్వడంతోపాటు కొత్త డీజీపీ నియామకానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుతో ఇరకాటంలో పడ్డ రాష్ట్ర ప్రభుత్వం పైకోర్ట్‌లో అప్పీల్ చేయనుంది.

పీఆర్‌సీ అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాదు: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ సిఫార్సుల అమలును రాష్ట్ర సర్కారు ఓకే చేసింది. ఫిట్‌మెంట్ శాతంపై జరిగిన తర్జనభర్జన అనంతరం.. వేతన పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను.. క్యాబినెట్‌ ఓకే చేసింది. అలాగే.. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని లెక్చరర్లకు 2006 యూజీసీ స్కేళ్లను అమలు చేయాలన్న ప్రతిపాదనను క్యాబినెట్‌ అంగీకరించింది. నల్సార్‌ లా వర్సిటీలో స్థానికులకు 20 శాతం రిజర్వేషన్‌ వర్తించేలా నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. 12 జిల్లాల్లో 21 పాలిటెక్నిక్‌ల శాశ్వత భవనాల నిర్మాణం కోసం.. [...]

గ్రామాలకు తెలంగాణా సందేశం

హైదరాబాద్‌: గ్రామస్థాయిలో తెలంగాణ ఆవశ్యక్తతను వివరించేందుకు జెఎసి కన్వీనర్‌ కోదండరామ్‌ ఆత్మగౌరవ జ్యోతి యాత్రను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో మొదలైన జ్యోతి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా తిరిగి హైదరాబాద్‌ చేరుకోనుంది. భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుట్రల వల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమవుతుందని కోదండరామ్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామంటూ కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండకపోతే ఫిబ్రవరి ఏడవ తేదీ తర్వాత [...]

మృతుల కుటుంబాలకు పలువురు నేతల సంతాపం

నర్సాపురం: గోదావరిలో నాటు పడవ బోల్తాపడిన ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రోశయ్య, పీఆర్‌పీ అధినేత చిరంజీవి, టీడీపీ అగ్రనేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు ఆపద్బాందు పథకం కింద రూ. 50వేలు, సీఎం సహాయనిధి కింద రూ.50 వేలు అందజేయన్నట్లు ఇన్‌చార్జి మంత్రి రఘువీరారావు తెలిపారు.

మెదక్‌ జిల్లాలో రూ.2కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

మెదక్‌: జిల్లాలోని నారాయణఖేడ్‌ మండలం రాలమడుగు వద్ద రూ. 2కోట్లు విలువైన గంజాయిని శనివారం అధికారులు పట్టుకున్నారు. ఓలారీలో అక్రమంగా రవాణా చేస్తుండటంతో అధికారులు పట్టుకొని లారీని సీజ్‌ చేశారు.

ఆర్టీసీ బస్సు -ద్వీచక్ర వాహనం ఢీ

కృష్ణా: ఆర్టీసీ బస్సు – ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన జిల్లాలోని గంపలగూడెం మండలం ఊటుకూరు సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

గాంధీజీకి సీఎం, డీఎస్‌ నివాళులు

హైదరాబాద్‌: జాతిపిత మహాత్మాగాంధీ 62వ వర్ధంతి సందర్భంగా శనివారం బాపూఘాట్‌ సమీపంలో పీసీసీ అధ్యక్షుడు, సీఎం గీతారెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌తో పాటు మంత్రి గీతారెడ్డి పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow

Get every new post delivered to your Inbox.