ఫారెస్ట్‌ డిపోకు నిప్పంటించిన మావోయిస్టులు

గడ్చిరోలి : మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించారు. తాజాగా మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా ఆలపల్లి అటవీ ప్రాంతంలోని కస్రా ఫారెస్ట్‌ డిపోకు ఆదివారం తెల్లవారుజామున మావోలు నిప్పంటించారు. ఈ ఘటనలో కోటి రూపాయలు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది.

గ్రేటర్‌లో కాంగ్రెస్‌ విజయం ఖాయం : లగడపాటి

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆయన అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదుర్చుకున్న బాబు, ప్రజలను కేసీఆర్‌ పాదాల వద్ద తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు.

కృష్ణానదిలో మునిగి నలుగురు యువతులు మృతి

అమరావతి: కృష్ణానదిలో మునిగి ఆదివారం నలుగురు యువతులు మృత్యువాతపడ్డారు. గుంటూరు జిల్లా కొత్తపేటలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఏడుగురు యువతులు, ఒక యువకుడు అమరావతి విహార యాత్రకు వచ్చారు. వీకెండ్‌ కావడంతో సరదాగా గడిపేందుకు వచ్చిన వీరిలో ఆరుగురు యువతులు స్నానం చేసేందుకు నదిలో దిగారు. అయితే అక్కడే ఉన్న బుంగలో కూరుకుపోయారు. గమనించిన స్థానికులు వీరిలో ఇద్దరిని రక్షించగలిగారు. మిగతా నలుగురు యువతులు మరణించారు.

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి సీఐకి గాయాలు

హైదరాబాద్‌: మలక్‌పేట పోలీసుస్టేషన్‌లో మంగళవారం ప్రమాదవశాత్తు సీఐ సత్యనారాయణ చేతిలో తుపాకీ పేలింది. సీఐ తొడలోకి బులెట్‌ దూసుకుపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సిబ్బంది ఆయన్ను హుటాహుటీన స్థానిక యశోదా ఆసుపత్రికి తరిలించారు.

గుంటూరు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కి షోకాజ్‌ నోటీసులు

గుంటూరు: జిల్లాలోని దాచేపల్లిలో జిలెటిన్‌స్టిక్స్‌ పేలుడుతో నేలమట్టమైన ఇళ్ల శిథిలాల తొలగింపు విషయంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఎస్‌ఈ నాగేశ్వరరావు అలక్ష్యంగా వ్యవహరించాడని జిల్లా కలెక్టర్‌ మంగళవారం ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. శిథిలాల తొలగించేందుకు సమయానికి ప్రొక్లెయిన్‌ పంపించకుండా నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఆయనను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించిన ఏఐఎస్‌ఎఫ్‌

హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘించి శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో చేసిన నియామకాలను రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి రోశయ్య ఇంటిని మంగళవారం ఏఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు ముట్టడించారు. వీటిని వెంటనే రద్దు చేయాలంటూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు.

కర్ణాటకలో విషాహారం తిని ఏడుగురి మృతి

బెంగళూరు: కర్ణాటకలోని గుల్బర్గాలో విషాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. సహాపుర తాలూకా కొంకల్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లికి హాజరైన వీరంతా భోజనం చేసిన కొద్దిసేపటికి అస్వస్తకు గురయ్యారు. దీంతో ఆందోళన చెందిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు.

సచివాలయ అధికారి నివాసాలపై ఏసీబీ దాడులు

హైదరాబాద్‌: సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సచివాలయంలో ఐటీ సెక్షన్‌ అధికారి నారాయణస్వామి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఉండటంతో హైదరాబాద్‌, పాకొల్లులోని నారాయణస్వామి నివాసాలతో పాటు ఆయన కుమారుని ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంగా దాడులు నిర్వహించారు. అయితే ఇప్పటివరకు సుమారు రూ. 5కోట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌లో వ్యాన్‌ బోల్తా : ఐదుగురి మృతి

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఉదయం బీజాపూర్‌ నుంచి రాయ్‌గడ్‌ వెళ్తున్న వ్యాన్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు క్రీడాకారులతో సహా డ్రైవర్‌ మృత్యువాతపడ్డారు. వీరంతా రాష్టస్థ్రాయి క్రీడల్లో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతులు బైరన్‌గఢ్‌కు చెందినవారని అధికారులు గుర్తించారు.

అనంతరపురం జిలాల్లో 29 లారీలు సీజ్‌

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో మంగళవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు నిరహించి 29 వాహనాలను సీజ్‌ చేశారు. నిబంధనలను విరుద్దంగా ఓవర్‌ లోడుతో వెళుతున్న వాహనాలను ఈ రోజు అధికారులు సీజ్‌ చేశారు. కేసులు నమోదు చేసి రూ. 7 లక్షలు జరిమానా విధించినట్లు సమాచారం.

Follow

Get every new post delivered to your Inbox.