నెల్లూరు : బంగాళాఖాతంలో ఏర్పడ్డ బలమైన అల్పపీడనం వద్ల నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న ఈ అకాల వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలమయింది. ఇప్పటివరకు జిల్లాలో సగటున 19.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు జనజీవనం స్థంభించిపోయింది. నెల్లూరులో డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేనందున లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో చెనై్న, నెల్లూరు రాకపోకలు స్థంభించి పోయాయి.
నవంబరు 7, 2009...10:17
వరద గుప్పిట్లో నెల్లూరు జిల్లా
Jump to Comments