నవంబరు 7, 2009...10:13

కుటుంబ సమేతంగా ఢిల్లీ చేరుకున్న జగన్‌

Jump to Comments

హైదరాబాదు : దివంగత వైఎస్‌ తనయుడు, కడప ఎంపి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అధిష్టానం పిలుపు మేరకు ఆయన ఇవాళ బెంగుళూరు నుంచి ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఆయన వెంట తల్లి విజయలక్ష్మీ, సతీమణి భారతి, సోదరి షర్మిల కూడా ఢిల్లీ వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆయన ఇవాళ సాయంత్రం అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య కూడా ఇవాళ ఢిల్లీలో అధినేత్రి సోనియా, హోంమంత్రి చిదంబరం, వీరప్పమొయిలీలతో భేటీ అయిన విషయం తెలిసిందే.

ప్రత్యుత్తరమిమ్ము