మావోల ఉనికికోసమే ఈ చర్యలు

రెబ్బెన: రోజురోజుకూ మావోయిస్టులు తమ ఉనికికోసం దానిని నిలదొక్కుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి అడిషనల్‌ ఎస్‌పి రమేష్‌బాబు అన్నారు. సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి ఓపెన్‌కాస్టులో మావోయిస్టులు వాహనాలను ద్వంసం చేసిన విషయంపై స్పందించిన ఆయన రెబ్బెన మండలం గోలేటి జిఎం కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో గత ఆగస్టు మాసం నుంచి చత్తీస్‌ఘడ్‌ నుంచి మావోలు వచ్చి సంచరించడం జరుగుతుందన్నారు. మంగి, ఇంద్రవెల్లి ఏరియాల్లో తిరుగుతున్నట్లు సమాచారం. డిసెంబర్‌ 2 నుంచి 8 వరకు [...]

ఆదిలాబాద్‌లో మావోల పంజా

తిర్యాణి: ఆదిలాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని డోర్లి ఒసిపి-1 లో మావోలు పంజా విసారారు. సింగరేణిలో ఆరు వాహనాలను మావోయిస్టులు దగ్దం చేశారు. గత ఐదారు సంవత్సరాలుగా జిల్లాలో మావోయిస్టులు ఎలాంటి విద్వంసాలకు పాల్పడకుండా ఉండడంతో జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉండగా, డోర్లి ఒసిపిలో జరిగిన సంఘటనతో జిల్లాలో మళ్ళీ మావోల ప్రభావం ప్రారంభమైంది. బుధవారం రాత్రి 10 గంటలకు దాదాపు 50 మంది మావోయిస్టులు డోర్లి ఒసిపి-1 సింగరేణి కార్యాలయానికి రాగా అందులో ఇద్దరు [...]

అక్రమ కలప తరలిస్తున్న లారీ పట్టివేత

ఇచ్చోడ: మండలంలోని దేవులనాయక్‌తాండ గ్రామ సమీపం నుంచి అక్రమంగా కలపను తరలిస్తున్న లారీ ఈజ్‌పూర్‌ చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ఇచ్చోడ అటవీశాఖ అధికారి వినయ్‌ కుమార్‌ సాహు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దేవులనాయక్‌తాండ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలుతోందని సమాచారం అందుకుతున్న అటవీశాఖ సిబ్బంది ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా ఆ ప్రాంతం నుంచి అనుమానాస్పదంగా లారీ హెచ్‌ఆర్‌ 38 ఎం 3872 కనిపించడంతో అటుగా వెళ్లిన సిబ్బందిని చూసి ఆ ప్రాంతం నుంచి [...]

కేసీఆర్‌ దీక్షా శిబిరం చుట్టూ ఆత్మాహుతి దళాలు

హైదరాబాదు: తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ేసీఆర్‌ చేపట్టే దీక్షను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హెచ్చరించారు. దీక్షా శిబిరం చుట్టూ ఆత్మాహుతి దళాలు ఉంటాయని అవసరమైతే పెట్రోల్‌ పోసుకుని చావనైనా చస్తాముకాని దీక్షను విరమించమని ఈటెల స్ఫష్టం చేశారు. అసలు దీక్షను చేపట్టకుండానే అడ్డుకుంటామనడం విడ్డూరమని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉద్యమం చేసే తమను అనవసరంగా ప్రభుత్వం రెచ్చగొడుతోందని ఈటెల అన్నారు. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తామని [...]

ఘనంగా బక్రీద్‌ పండగ

హైదరాబాద్‌: త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్‌ పండగను ముస్లింలు సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. శనివారం నగరంలోని పాతబస్తీలో ముస్తాబైన మీరాలం ఈద్గాలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. దైవప్రేమలో తనకు చెందిన సర్వస్వాన్ని త్యాగం చేసే వాగ్దానాల పండుగ అయిన బక్రీద్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సామూహిక ప్రార్థనలు జరుపుకున్నారు.

కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌లో వ్యాపించిన మంటలు

అనంతపురం: న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో మంటలను గమనించిన ప్రయాణికులు గుంతకల్‌ రైల్వే అధికారులకు తెలిపారు. వెంటనే రైలును గుంతకల్‌ జంక్షన్‌లో నిలిపివేసిన సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు. ఈ క్రమంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా మంటల వ్యాపించిన బోగీలను తొలగించిన రైల్వే సిబ్బంది వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి అనంతరం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ వలనే బోగీల్లో మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.

కాంగ్రెస్‌గూటికి స్మిత థాక్రే ?

ముంబాయి: శివసేన అధినేత బాల్‌థాక్రే పెద్ద కోడలు స్మితా థాక్రే త్వరలో ఆ పార్టీకి స్వస్తి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. శనివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పార్టీలో తనను చిన్నచూపు చూస్తున్నారని, అవమానాలు భరించలేకే కాంగ్రెస్‌లో చేరుతున్నాని స్మితా స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని స్మితా ప్రశంసల జల్లు కురిపించింది. సోనియా, రాహుల్‌ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె తెలిపారు. బీజేపీ, శివసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు స్మితా చక్రం తిప్పారు. రాజకీయాలను [...]

పలు కేంద్రాల్లో నిలిచిపోయిన క్యాట్‌ పరీక్ష

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) ఆన్‌లైన్‌ పరీక్షలు పలు కేంద్రాల్లో నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌ సిస్టమ్‌ ద్వారా జరుగుతున్న ఈ పరీక్షలో సర్వర్‌లో సాంకేతి లోపం వలన అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా నిర్వహించడంతో భోపాల్‌, బెంగళూరు, చెనై్న, పూణెలో ఈ పరీక్షలు అంతరాయం కలగడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు సమాచారం. కాగా హైదరాబాద్‌లో మాత్రం ఈ పరీక్షకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకపోడవంతో పరీక్ష సజావుగా సాగినట్లు సమాచారం.

కడప జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు

కడప: ఇనుప ఖనిజంతో బళ్లారి నుంచి వస్తున్న గూడ్స్‌ రైలు కడప జిల్లా కృష్ణాపురం వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 15 బోగీలు బోల్తాపడటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు చెనై్న నుంచి తెప్పించిన క్రేన్ల ద్వారా మార్గాన్ని పునరుద్దరించేందుకు యత్నిస్తున్నారు. ఓవర్‌ లోడ్‌ వలనే ఈ ప్రమాదానికి గల కారణమనఇధికారులు తెలిపారు. అయితే ఈ మార్గం నుంచి వెళ్లె రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌, వెంకటాద్రి, ముంబాయి-చెనై్న, దాదార్‌, చెనై్న, ముంబాయి-కన్యాకుమారి పలు [...]

రామగుండం ఎమ్మెల్యేపై హోంమంత్రికి ఫిర్యాదు

హైదరాబాద్‌: వివాహం చేసుకుంటానని చెప్పిన రామగుండం ఎమెల్యే సత్యనారాయణ తనను మోసం చేశాడని విజయలక్ష్మి అనే మహిళ శుక్రవారం రాష్టహ్రోంమంత్రి సబితారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని ఆమె మంత్రిని కోరారు.

Follow

Get every new post delivered to your Inbox.