కాంగ్రెస్‌ నాయకుడు దారుణహత్య

విజయవాడ: పశ్చిమకృష్ణాలో రాజకీయ హత్యల పరంపర ప్రారంభమైంది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట కాంగ్రెస్‌నేత గింజుపల్లి వీరయ్యచౌదరిని ఈఉదయం ప్రత్యర్థులు గొడ్డళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. నెలరోజుల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందిన ఏబీసీ సంస్థల అధినేత, తెలుగుదేశం నాయకుడు ఆలూరి బుచ్చియ్య చౌదరి కేసులో వీరయ్య ప్రధాన అనుమానితుడు. బుచ్చయ్య హత్యకు ప్రతీకారంగానే వీరయ్యను ప్రత్యర్థులు హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు.

నాలుగు రోజుల్లో కేసీఆర్‌ దుకాణం బంద్‌ : మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌: మరో నాలుగు రోజుల్లో తెరాస అధినేత కేసీఆర్‌ దుకాణం బంద్‌ కాబోతోందని కార్మికశాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రోశయ్యపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఆయనకున్న బలం ఎటుపోతోందో ఆయనకే తెలియని అయోమయ స్థితి నెలకొందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అవిశ్వాస తీర్మానాన్ని ఏవిధంగా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. వరద బాధితుల సహాయార్థం భద్రాచలం పౌరసమితి ఆధ్వర్యంలో రూ.6లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.

లారీ, వ్యాన్‌ ఢీ: ముగ్గురు మృతి

విజయనగరం: జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బండపల్లి మండలం నందకపేట వద్ద లారీ, వ్యాన్‌ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, నలగురు గాయపడ్డారు.

రహదారులకు రు. 50కోట్లతో మరమ్మతులు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులకు 50 కోట్ల రూపాయలవ్యయంతో తాత్కాలిక మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి రోశయ్య నిర్ణయించారు. పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ హైవే కింద ఎలాంటి ట్రక్‌ పార్కింగ్‌కు అనుమతివ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా బాపూఘాట్‌ రహదారిలో పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మెట్రో వాటర్‌బోర్డు ప్రతినెలా అదనంగా భరిస్తున్న 17 కోట్ల రూపాయల వ్యయాన్ని ఆస్తిపన్నులో నుంచి 25 శాతం భర్తీ చేయాలని [...]

టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: మైసూరారెడ్డి

హైదరాబాద్‌: టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని టీడీపీ సీనియర్‌నేత మైసూరారెడ్డి డిమాండ్‌ చేశారు. ఒక వ్యక్తినో, ఒక సంస్థనో దృష్టిలో పెట్టుకుని టెండర్ల ప్రక్రియకు నిబంధనలు విధించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాకతీయ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు తాడిచర్ల గనుల నుంచి బొగ్గు సరఫరా చేయడం కోసం తాడిచెర్ల కన్సార్టియంకు కాంట్రాక్టు దక్కేలా పెద్ద స్థాయి నేతల ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. 104 స్కీం కింద అంబులెన్స్‌ల కొనుగోలులో కూడా ఇలాంటి రాజకీయ [...]

ఐఐటీల పునర్‌వ్యవస్థీకరణకు కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ: ఐఐటీల పునర్‌వ్యవస్థీకరణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి కపిల్‌సిబాల్‌ తెలిపారు. అయిదుగురు సభ్యులు ఉండే ఈ కమిటీ అణుశక్తి కమిషన్‌ ఛైర్మన్‌ అనిల్‌ కాకోద్కర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఐఐటీల్లో సమూల సంస్కరణలు చేయవలసిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఐఐటీల్లో ప్రవేశం ఎలా సంపాదించాలో చెప్పే కోచింగ్‌సెంటర్లు పెరిగిపోయాయి కాని విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెంచే కాలేజీలు తగ్గిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మార్చేందుకు [...]

వృత్తివిద్యాకోర్సులు చదివినవారికోసం జాబ్‌మేళా

హైదరాబాద్‌: వృత్తి విద్యాకోర్సుల్లో ఉత్తీర్ణులకు హైదరాబాద్‌ నాంపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని ఇంటర్‌ విద్యా డైరెక్టర్‌ లవ అగర్వాల్‌ తెలిపారు. ఈనెల 21న ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ మేళా ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణా జిల్లాలకు మాత్రమే మేళా పరిమితమన్నారు. వివిధ వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఈ మేళా ద్వారా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. 18 ఏళ్ళ వయసుండి, ఇంటర్‌ [...]

రాజేశ్వరి మృతి కేసును సుమోటొగా స్వీకరించిన హక్కులకమిషన్‌

హైదరాబాద్‌: దేవరకద్ర వ్యవసాయ అధికారిణి రాజేశ్వరి మృతి కేసును మానవహక్కుల కమిషన్‌ సుమోటొగా స్వీకరించింది. ఈనెల 26 లోగా రాజేశ్వరి మృతిపై పూర్తి వివరాలు ఇవ్వాలని మహబూబ్‌నగర్‌ ఎస్పీకి మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. రాజేశ్వరి మృతి అనంతరం తీసుకున్న చర్యలతో పాటు ఆమెపై ఆధారపడ్డ వారికి ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారో వివరించాలని కమిషన్‌ ఆదేశించింది. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల కారణంగానే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్‌ [...]

ఎక్స్‌ప్రెస్‌ వే ఎవరికోసమంటే…

హైదరాబాద్‌: మెహదీపట్నం నుంచి ఆరాంఘర్‌ వరకు నిర్మించిన పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై నిర్ణీత వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఎక్స్‌ప్రెస్‌ వే పై ద్విచక్రవాహనాలు, ఆటోలు, సైకిళ్లు, సరకు రవాణా వాహనాలు, ట్రాక్టర్లు, నెమ్మదిగా వెళ్లే అన్నిరకాల వాహనాలకు అనుమతి లేదని హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. పాదచారులు కూడా ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై వెళ్లడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రధానంగా శంషాబాద్‌ విమానాశ్రయం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని నిర్మించిన ఈ మార్గంలో [...]

రాజీవ్‌ వల్లే దేశాభివృద్ధి: దేవానంద్‌ కన్వర్‌

హైదరాబాద్‌: రాజీవ్‌గాంధీ ఆలోచనావిధానం వల్లే దేశం అభివృద్ధిపథం వైపు మళ్లిందని బీహార్‌ గవర్నర్‌ దేవానంద్‌ కన్వర్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద రాజీవ్‌ సద్భావనా స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కన్వర్‌తో పాటు కేర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ సోమరాజులకు సద్భావనా అవార్డులను బహూకరించారు. ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీవ్‌ ఆశయమైన సంస్కరణలను మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సమర్థంగా అమలు చేశారని [...]

Follow

Get every new post delivered to your Inbox.