అరుదైన రుద్రాక్ష మాలల ప్రదర్శన


హైదరాబాద్‌: పురాణాలకే పరిమితమై, సాధారణంగా చూడడానికి వీలుకాని అనేక అరుదైన రుద్రాక్షలను ప్రస్తుత పవిత్ర కార్తికమాసంలో ప్రదర్శనను ఏర్పాటు చేశామని రుద్రాక్ష నిపుణులు, వేద, గణిత శాస్త్రవేత్త డాక్టర్‌ జి.పాండురంగారావు తెలిపారు. ఈ అరుదైన రుద్రాక్షల ప్రదర్శనను రవీంద్రభారతిలో 21 నుండి నవంబర్‌ 2వ తేదీవరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటిలో గుండ్రటి ఏకముఖి, నాగరుద్రాక్ష, శ్రీకంఠమాల, సిద్ధమాల, త్రిజురి, త్రినేత్రం మాలలతో పాటు అత్యంత విలువైన ఇంద్రమాల(72 లక్షలు)మరియు 32 ముఖంలు కలిగిన రుద్రాక్ష కూడా ప్రదర్శనలో ఏర్పాటు చేశామని తెలిపారు. దివంగత కంచి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి స్వామి దర్మించిన పవిత్ర గౌరిశంకర్‌ రుద్రాక్ష మాలను(అమ్మకాని కాదు) కూడా ప్రదర్శనలో ఉంచామని అన్నారు. సాధారణ రుద్రాక్ష మాలలు అమ్మకానికి ఉంచినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రదర్శన ఉదయం 10.30 నుండి సాయంత్రం 8.30 నిమిషాలవరకు నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని సందర్శకులు సద్వినియోగం చేసుకోవాలని పాండురంగారావు కోరారు.

One Response

  1. SIR, NAKU RUDRAKSHA CHETTU EKADA DORUKUTUNDO TELIYA JAYANDI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.