రబీ సీజన్‌లో విత్తనాలకు 50 శాతం సబ్సిడీ

హైదరాబాద్: రబీ సీజన్‌లో రైతుకు కావాల్సిన ప్రతి విత్తనాన్ని 50 శాతం సబ్సిడీతో ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో సిఎం రోశయ్య అధ్యక్షతన రబీ సీజన్‌పై సమీక్షా సమావేశం జరిగింది. రబీకి అవసరమైన విత్తనాల్లో ఐదు లక్షల క్వింటాళ్లు ఇప్పటికే పంపించామని, మరో 8 లక్షల క్వింటాళ్లు మండల కేంద్రాల్లో సిద్థంగా ఉంచామని రఘువీరా తెలిపారు. ఆహార భద్రత దృష్ట్యా రబీ వరి సాగు ఎక్కువగా చేయాల్సిందిగా రైతులకు సూచించారు. ఈ రబీ [...]

‘ఇస్రో’ బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్‌

హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా నిమితులైన రాధాకృష్ణన్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గత చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ స్థానంలో నిమితులైన రాధాకృష్ణన్‌ 35 సంవత్సరాలుగా భారత అంతరిక్ష పరిశోధన రంగంలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. ఇంతకు ముందు ఆయన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో నేనీ బాధ్యతలు చేపట్టాను. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.

తెరాస పోటీ చేయాలి: తలసాని

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఫ్రీజోన్‌ వంటి పెద్ద అంశాన్ని తీసుకుని పోరాటం చేస్తూ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెరాస అనుకోవడం విడ్డూరమని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పోటీ చేస్తే తెరాసకు సహకారం ఎంత లభిస్తుందో తెలుస్తుందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం [...]

ఇందిరాగాంధీకి నివాళులర్పించిన సిఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య శనివారం గాంధీభవన్‌లో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పగుచ్చములుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల అభ్యున్నతికోసం కృషి చేసిన మహా నాయకురాలు ఇందిరాగాంధీ అని రోశయ్య పేర్కొన్నారు. దేశం కోసమే ప్రాణాలు త్యాగం చేశారని అన్నారు. అలాంటి త్యాగమూర్తిని ఈరోజు మనం స్మరించుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

110 డివిజన్లలో ‘రాజ్యం’ పోటీ

హైదరాబాద్: రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు సంబంధించి ప్రజారాజ్యం పార్టీ ఒక ప్రకటన వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత హరిరామ జోగయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తాము 110 పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తమకు 40 డివిజన్లలో గెలుపు గుర్రాలున్నాయని, వీటిలో తమకు 20 నుంచి 30 స్థానాలు వచ్చినా కార్పొరేషన్‌ను ఆటాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనేక పార్టీలు పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి 50కి మించి సీట్లు [...]

మజ్లీస్‌తో పొత్తు ఆలోచన లేదు: డిఎస్‌

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మజ్లీస్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచనగానీ, ఆ ఆలోచన గానీ లేదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. మజ్లీస్‌పై మీకు అంత ప్రేమ పెరిగిందేమిటని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. తాము గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మొత్తం 150 డివిజన్లలో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో 70 శాతం సీట్ల గెలుపే ధ్యేయంగా పని చేస్తామని [...]

శ్రీవారి ఆశీస్సులతో.. కల్యాణమస్తు

తిరుపతి: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం శ్రీవారి ఆశీస్సులతో జరుగుతున్న కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 7802 జంటలు ఒక్కరి కానున్నాయి. ఈ కార్యక్రమానికి గత ఏడాదికంటే అధికంగా స్పందన వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శేషారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకూ 27 వేల పెళ్ళిళ్లు నిర్వహించామన్నారు. ఐదవ విడత కళ్యాణమస్తు కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కేంద్రాలకు తాళిబొట్లు, మెట్టెలు, బట్టలు, పుస్తక ప్రసాదం, వివాహ ధృవీకరణ పత్రాలు [...]

సక్సెస్‌ పథకంకు పలు అడ్డంకులు

కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సక్సెస్‌ పాఠశాలల పథకం కొండెక్కేలా ఉంది. ప్రారంభించినా రెండవ యేటే చతికిన పడే సూచనలు కనబడడంతో ప్రభుత్వం శాస్త్రీయ సర్వేకు నడుం బిగించింది. ఇందుకు సంబంధించి అందరి అభిప్రాయాలను సేకరించి, క్రోడీకరించి సక్సెస్‌కు వచ్చిన మార్కుల ఆధారంగా కొనసాగించాలా వద్దా అని నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అన్ని జిల్లాలో వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. గ్రామీణులకు సైతం పూర్తి స్థాయి ఇంగ్లీష్‌ మీడియం హైస్కూళ్లను అందుబాటులోకి తేవాలని 2008 [...]

జీతం 20 రూపాయలే!

రూపాయి విలువ పడిపోయిన ఈ రోజుల్లో 20 రూపాయలకు ఏం వస్తుంది… మార్కెట్ లో ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు కూడా రావు. కూరగాయలు సరేసరి.. మహా అయితే గీచిగీచి బేరం ఆడితే… ఓ రకమైన అరటి పళ్ళు డజను లేదంటే పది పళ్ళు మాత్రమే వస్తాయి. కానీ రాజస్థాన్ లోని బలపుర గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలో జగదీష్ శర్మ నెలవేతనం మాత్రం అక్షరాలా 20 రూపాయలే! అదీ ఎప్పటి నుంచో తెలుసా! 1986 నుంచి… అంటే [...]

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం: యనమల

కాకినాడ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా పార్టీ కార్యాలయంలో కాకినాడ సిటి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా యనమల మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ధనార్జనే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసమస్యలపై పోరాడేది టిడిపి [...]

Follow

Get every new post delivered to your Inbox.