హనుమంతరావు వ్యాఖ్యలతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

నెల్లూరు: దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. రాజశేఖర్‌ఖరరెడ్డి మరణించిన తరువాత జరిగిన చావులన్నీ బోగస్‌లని రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ప్రకటించడాన్ని జిల్లా కాంగ్రెస్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఆనం వివేకానందరెడ్డి బుధవారం పత్రికావిలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కనీస నైతిక విలువలు కూడా తెలియని హనుమంతరావు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హనుమంతరావును చంపుతామంటూ జగన్‌ వర్గీయులు బెదిరింపుకాల్స్‌ చేస్తున్నారన్న, వ్యాఖ్యలపై వివేకానందరెడ్డి [...]

సమస్యల పరిష్కారాలకు సింగరేణి సన్నాహలు

ఖమ్మం: సింగరేణిలో చేసిన ఫిర్యాదులు నెలల తరబడి పరిష్కృతం కాకుండా ఉంటాయన్న అపోహకు తెరదించేందుకు సింగరేణి సంస్థ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తమకు అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. తమకు అందే ప్రతీ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని సిద్ధం చేసే బాధ్యతను సిబ్బందికి అప్పగించారు. ఇకపై అపరిష్కృత ఫిర్యాదులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సంబంధిత క్లర్కులు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వారికి తగిన [...]

ఇంటర్‌ పరీక్షా ఫీజు గడువు పెంపు

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫీజు గడువు అక్టోబర్‌ 8వ తేదీవరకు పెంచినట్లు ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ పర్యవేక్షాణాధికారి ఎం. విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము వంద రూపాయలతో అక్టోబర్‌ 15వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చునని అన్నారు.

జీడిపప్పు నుండి నూనె ఉత్పత్తి పరిశ్రమ ప్రారంభం

శ్రీకాకుళం: బాయిలింగ్‌ విధానంలో జీడిపప్పు తీసివేయగా మిగిలిన జీడిపప్పుల నుండి నూనె ఉత్పత్తిచేసే పరిశ్రమను పలాసా పారిశ్రామిక వాడలో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలు డాక్టర్‌ కె. కృపారాణి ప్రారంభించారు. శ్రీరామ సిఎంఎస్‌ ఆయిల్‌ ఇండస్ట్రీ పేరిట నెలకొల్పిన ఈ పరిశ్రమలో 20బాయిలింగ్‌ పరిశ్రమల నుండి విడుదల అవుతున్న వ్యర్థాల నుండి ఆయిల్‌ ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ యజమాని నాగేశ్వరరావు తెలిపారు. ఈసందర్భంగా పారిశ్రామిక వాడలోని మౌలిక సమస్యలను జీడిఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం. రామేశ్వరరావు తదితరులు [...]

ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం: ఇన్ఫోసిస్‌లో అకౌంటింగ్‌, ఎగ్జిక్యూటీవ్‌ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ బి. పోలీసు తెలిపారు. కమీషనర్‌ ఆఫ్‌ కాలేజీ హేడ్‌ ఎడ్యూకేషన్‌ హైదరాబాదు సహాకారంతో జరుగుతున్న ఉద్యోగమేళాకు 2009 సంవత్సరం బికాం, లేదా ఎంకాం 50శాతం ఉత్తీర్ణత పొంది ఎదైనా జెకేసీ ద్వారా శిక్షణ పొందిన వారు మాత్రమే అర్హులని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల విద్యార్థులు తమ కళాశాలల్లో అక్టోబర్‌ 3నుండి 6లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. [...]

3వ తేదీ నుండి కళాసందడి

శ్రీకాకుళం: శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య దశ వసంతోత్సవాలు స్థానిక బాపూజీ కళామందిర్‌లో అక్టోబర్‌ 3నుండి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక విభాగం అధికారి పి. నర్సింహ్మమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 3రోజులు ఉదయం సాయంత్రం పలువురు ప్రముఖుల ఉపనాస్యాలు రాత్రి 8గంటలకు నాటక ప్రదర్శనలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయిస్తున్న నంది నాటకోత్సవాల్లో ప్రథమ బహుమతి పొందిన ఏలూరువారి’ఏవరో ఒకరు’నాటికి మొదటి రోజు ప్రదర్శిస్తారన్నారు. 4వ తేదీన కాకినాడ కళాకారులచే [...]

ప్రజా సమస్యలపై పాదయాత్రలు

శ్రీకాకుళం: ప్రజలు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్టోబర్‌ 25 నుండి 31వ తేదీవరకు గ్రామాలలో పాదయాత్రలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక క్రాంతిభవన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు గ్రామాల్లో పారిశుద్ధ్యం, పింఛన్‌ల పంపిణీ జరుగుతున్న తీరు తదితర అంశాలపై అధ్యయనం చేసి సంబంధిత [...]

దొంగసోత్తు కలిగిన నేరంపై జైలు

శ్రీకాకుళం: దొంగసోత్తు కలిగి ఉన్నారనే అభియోగం రుజువు కావడంతో డి.రాజు అనే వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ స్థానిక జ్యూడీషీయల్‌ మొదటి తరగతి న్యాయమూర్తి తీర్పు చెప్పారు. శ్రీకాకుళం పట్టణంలోని కుందనపు వీధికి చెందిన మల్లేశ్వరరావు ఇంటికి తాళం వేసుకుని పక్కింటివారికి తాళం ఇచ్చి వెళ్ళారు. మల్లేశ్వరరావుతో పరిచయం ఉన్న రాజు వారి వద్ద తాళం తీసుకుని ఇంట్లో ప్రవేశించి బంగారు ఆభరణాలు, రెండు రిస్టీవాచీలు అపహరించాడు. విషయం తెలుసుకున్న మల్లేశ్వరరావు 2009 జూన్‌ [...]

సంక్షేమ అధికారి పోస్టులకు 120 దరఖాస్తులు

శ్రీకాకుళం: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భర్తీ కానున్న 5 మహిళా సంక్షేమాధికారి పోస్టులకు ఇప్పటివరకు 120మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ శాఖ కార్యాలయంలో ఒరిజినల్‌ ధృవీకరణ పత్రాల పరిశీలన జరిగింది. కొందరు పూర్తిస్థాయిలో ధృవీకరణ పత్రాలు తీసుకురాకపోవడంతో వారిని తిప్పిపంపించారు. ఇప్పటివరకు 120దరఖాస్తులు వచ్చాయని వీటిని పరిశీలిస్తున్నామని పాపారావు తెలిపారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రామ్‌కిషోర్‌ మృతి

శ్రీకాకుళం: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన జిల్లాలోని నర్సన్నపేట మండల పరిధిలోగల జమ్ము గ్రామానికి చెందిన సాధురాంకిషోర్‌ మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి సాధుచెంగల్వరాయుడు ధృవీకరించారు. రాంకిషోర్‌ మృతి విషయాన్ని ఆయన బంధువులకు తెలిపారు. ఈనెల 24న స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా అమెరికాలోని వోస్టర్‌ సమీపంలోకారు బోల్తాపడింది. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా రాంకిషోర్‌ గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన రాంకిషోర్‌ను స్థానికంగా ఆసుపత్రిలో చేర్పించిన విషయం విదితమే. అనంతరం ఇతడు మృతిచెందినట్లు ధృవీకరించారు. ఆయన కోరిక [...]

Follow

Get every new post delivered to your Inbox.