రుణాల మంజూరు గ్రీవెన్స్‌ను ఆశ్రయించిన క్షౌరవృత్తిదారులు

విజయనగరం: నాయీబ్రాహ్మణ సహకార సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ క్షౌరవృత్తి దారుల సంఘం జిల్లా కమిటీ కార్యదర్శి టి.వి. దుర్గారావు సోమవారం ఉదయం కలెక్టరేట్‌ గ్రావెన్స్‌లో జి.రామనారాయణరెడ్డిని కలిసి కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల మందు ప్రభుత్వం క్షౌరవృత్థిదారుల పోరాట ఫలితంగా విడుదల చేసిన జోఓ 57ను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వెంటనే ఆ జీఓలో పేర్కొన్న అంశాల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

వాసవిక్లబ్‌ సభ్యుల పర్యటనను విజయవంతం చేయాలి

విజయనగరం: జిల్లాలో పర్యటించనున్న వాసవిక్లబ్‌ అంతర్జాతీయ ముఖ్య సభ్యుల పర్యటనను విజయవంతం చేయాలని వాసవిక్లబ్‌ అధ్యక్షులు శేఖర్‌ కోరారు. సోమవారం ఉదయం ఓ వస్త్రదుఖాణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లయిన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు వెచ్చ సత్యనారాయనతో కలిసి మాట్లాడారు. వాసవీ నిర్మాణం సప్తాహం ప్రారంభోత్సవం సందర్భంగా పర్యటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అతిథులుగా వాసవీ క్టబ్‌ ఇంటర్‌నేషనల్‌ అధ్యక్షులు గుప్త, వనిత క్లబ్‌ అధ్యక్షురాలు ఆలవెల్ళి మాలతి, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ పర్యటనను పురస్కరించుకుని [...]

సమస్యల సాధనకై పట్టణ పేదల సంక్షేమ సంఘం ఆందోళన

విజయనగరం: పట్టణంలో పలువురు నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయనగరం పట్టణ పేదల సంక్షేమ సంఘం సోమవారం ఉదయం కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఆందోళనకు నాయకత్వం వహించిన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దుర్గారావు, రెడ్డి శంకరరావులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సుందరయ్య కాలనీలో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించిందని, అయితే ఇప్పటికీ కరెంట్‌ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పట్టణ పరిధిలో కిరోసిన్‌ అక్రమంగా నల్లబజారుకు తరలిపోతుందని, ఆ రోగులకు వెంటనే పట్టుకోవాలని [...]

కరువు భారినపడిన గొర్రెల కాపర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

విజయనగరం: కరువు భారినపడ్డ గొర్రెల కాపర్లను ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం ఉపాధ్యక్షులు పడగల బంగార్రాజు డిమాండ్‌ చేశారు. జిల్లాలో కరువు ఏర్పడిన నేపథ్యంలో గొర్రెలను మేపడానికి గ్రాసం నీరులేక వెళ్ళిన వారిని కలిసేందుకు గొర్రెలు, మేకల పెంపకందారుల బృందం విజయనగరం మండలంలోని దుప్పాడ, కణపాక, ద్వారపాడి, గుంకలాం, బియ్యాలపేట ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా బంగార్రాజు మాట్లాడుతూ, కరువు ఏర్పడిన నేపథ్యంలో గొర్రెల కాపర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. [...]

ఘనంగా ఆదిభట్ల ఆరాధనోత్సవాలు ప్రారంభం

విజయనగరం: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 26వ ఆరాధనోత్సవాలు పట్టణంలో ఇక్కడి అయిన్స్‌ క్లబ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగునున్న ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 8 గంటలకు దాసుగారు చిత్ర పటాన్ని ఊరేగించారు. పూజాధికాలు అనంతరం 10 గంటలకు జానకి శపధంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇదిలా ఉండగా సాయంత్రం 6 గంటలకు గజేంద్రమోక్షం, సీతా కళ్యాణం హరికథాగానం జరుగుతుంది. మంగళవారం నాడు శ్రీరామ జననం, శ్రీనివాస కళ్యాణం కథాగానాలు ఉంటాయి. సాయంత్రం పురస్కారాలు ప్రధానోత్సవం [...]

గ్రంథాలయాలభివృద్ధికి అందరూ సహకరించాలి

విజయనగరం: పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పొందగలిగే గ్రంథాలయాల అభివృద్ధికి అందరూ సహకరించాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు రొంగలి పోతన్న అన్నారు. దాసన్నపేట విజ్ఞాన జ్యోగి శ్రీకనకల రాములు మెమోరియల్‌ లైబ్రరీ, నాగవంశ సంక్షేమ సంఘం వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. పూర్తిగా సామాజిక కార్యక్రమం ఏర్పరచి సేవలందిస్తున్న నాగవంశ సంక్షేమ కమిటీని ఆయన అభినందించారు. ముఖ్య అతిథి టి.సత్యనారాయణ మాట్లాడుతూ, సమాజం కోసం పనిచేస్తున్న కమిటీ సేవలు కొనియాడారు. కనకల ఆదినారాయణ [...]

రచయితల ఖిల్లా.. విజయనగరం జిల్లా

విజయనగరం: బాల సాహిత్యం కోసం విశేషమైన కృషి చేసిన రచయితలు గల జిల్లా విజయనగరమేనని సాలూరుకు చెందిన రచయిత కిలపర్తి దారి నాయుడు అన్నారు. గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య 349వ సభ బాల భారతి కార్యక్రమంలో జిల్లాలో బాల సాహిత్య తీరు తెన్నులు అంశంపై ఆయన ప్రసంగించారు. 18వ శతాబ్ధం తరువాత ముద్రణలో అనేక బాలల కథలు వచ్చాయని అన్నారు. పొడుపు కథలు, దేశభక్తి, వీరగాధలు వంటి ఎన్నో [...]

అంబేద్కర్‌ హక్కుల పోరాట సమితి ధర్నా

విజయనగరం: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డి.డి.రమణమూర్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్‌ హక్కుల పోరాట సమితి సోమవారం ఉదయం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగింది. బడుగుల పిల్లలను బడికి పంపాలని అందుకు కావాల్సిన వసతి సౌకర్యాలను సమకూర్చాలని రాజ్యాంగం ఆదేశిస్తుంటే, ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ అవినీతికి దోపిడి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోకుంటే దళితుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవల్సి వస్తుందని ధర్నాకు నాయకత్వం వహించిన దళిత నాయకులు [...]

ప్రిన్సిపాల్‌పై చర్యలకు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

విజయనగరం: దళిత విద్యార్థులను వేధిస్తున్న రీటాగ్రేస్‌ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు విద్యార్థినులు సోమవారం ఉదయం కలెక్టరేట్‌ వద్ద నిరవధిక ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు అఖిల భారతీయ విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహనరావు మాట్లాడుతూ గరుగుబిల్లి గురుకుల పాఠశాల విద్యార్థులను ప్రిన్సిపాల్‌ రీటాగ్రేస్‌ వేధిస్తుండడం దురదృష్టకరమన్నారు. దళిత విద్యార్థులన్న వివక్షతతో విద్యార్థినులను వేధించడమే కాకుండా, మెనూను అమలు చేయడం లేదన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన [...]

ఉత్తమ వ్యక్తిగత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

మచిలీపట్నం: కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువక కేంద్రం ఆధ్వర్యంలో 2008-09 సంవత్సరానికిగాను అనుబంధ యువజన సంఘాలు, మహిళా సంఘాల నుండి జిల్లాస్థాయి ఉత్తమ వ్యక్తిగత మరియు యువజన సంఘం అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా జిల్లా నెహ్రూ యువక కేంద్రం కోఆర్డినేటర్‌ డి.జె.ప్రసన్న తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌ 1 నుండి ఈ ఏడాది మార్చి 31 వరకు నిర్వహించిన కార్యక్రమాల సరళిపై ఆధారపడి ఉత్తమ సంఘాల ఎంపిక జరుగుతుందని అన్నారు. [...]

Follow

Get every new post delivered to your Inbox.