శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాలకొండ మండల కేంద్రంలో ఉన్న ఈ ఆలయానికి వచ్చే నెల 19 నుంచి 9 రోజులపాటు ఘనంగా వేడుకలు జరిపేందుకు దేవాదాయశాఖ సిద్ధమైంది. ఆలయ మేనేజర్ బి.సూర్యారావు ఏర్పాట్ల విషయమై తెలియజేస్తూ ప్రత్యేక అధికారి విజయ్‌కుమార్ పర్యవేక్షణలో పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. గత ఏడాది ఉత్సవాలకు సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసిన ఆలయ అధికారులు ఈ ఏడాది మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు సమాయత్నం చేస్తున్నారు. అమ్మవారి నిజస్వరూప దర్శనానికి క్యూలైన్ల ఏర్పాట్లు తదితర వాటిని ముమ్మరం చేస్తుండగా, తొమ్మిది రోజులపాటు జరిగే కుంకుమ పూజలకు భక్తులు తమ పేర్లను ముందుగానే నమోదు చేసుకోవాలని ఆయన చెప్పారు.
Filed under: వార్తలు Tagged: | శ్రీకాకుళం




