ఆయేషా కేసు నేటికి వాయిదా

విజయవాడ: బి-ఫార్మసి విద్యార్థి ఆయేషామీర హత్యకేసు విచారణలో భాగంగా పాదముద్రల నిపుణులు, డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించిన అధికారులు సోమవారం కోర్టులో హాజరయ్యారు. సంఘటన స్థలంలో దొరికిన పాదముద్రలు ఈ కేసులోని నిందితుడైన సత్యంబాబు పాదముద్రలతో సరిపోయాయని నిపుణులు సాక్ష్యం ఇచ్చారు. అలాగే బిఎన్‌ఎ పరీక్షల్లో కూడా సత్యబాబు సంబంధించిన అంశాలే ఉన్నట్లు తెలిందని అధికారులు కోర్టులో వివరించారు. శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించామని అన్ని సరిగానే ఉన్నాయని వారు నిందితుడి తరపు న్యాయ వాధి కె. రామ్మోహన్‌రావు [...]

కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

విజయవాడ: విజయవాడ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇబ్రహీంపట్నంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌పై, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ వర్గీయులు కుర్చి విసరగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. సమావేశం వేదికపైకి ఇబ్రహీంపట్నం ఎంపిపి మధవరావును పిలవకపోవడం ఈ వివాదానికి దారితీసింది. దీంతో ఎమ్మెల్యే రమేష్‌ వర్గీయుడు అగ్రహోదగ్రులై లగడపాటి మీద కుర్చీలు విసిరారు. కాగా, ఎంపి వర్గీయులు కూడా [...]

ఆరవిదనగర్‌లో గ్రామీణ బ్యాంకు శాఖ ప్రారంభం

కడప: రాష్ట్ర గ్రామీణ బ్యాంకు ఐదు జిల్లాల్లో 359 శాఖల్లో 72లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తున్నదని ఆ బ్యాంకు చైర్మన్‌ జయప్రకాశ్‌ చెప్పారు. కడపలోని అరవిదనగర్‌లో సోమవారం గ్రామీణ బ్యాంకు శాఖను ప్రారంభించారు. 6200 కోట్ల రూపాయలు లావాదేవీలు తమ బ్యాంకు ద్వారా జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే తమ శాఖలో అన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయనున్నామని ఆయన చెప్పారు. గత ఏడాది స్వయం సంఘాలకు 750 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని, ఈ ఏడాది 800 [...]

9న సిఎం కడప జిల్లా పర్యటన

కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, సెప్టెంబర్‌ 9న జిల్లా పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్‌ కార్యాలయానికి సమాచారం అందింది. సింహాద్రిపురం మండలం పైడిపాటెం రిజర్వాయర్‌ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆ తరువాత ముఖ్యమంత్రి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలను తనిఖీ చేస్తారని ఈమేరకు కలెక్టర్‌ కార్యాలయానికి సమాచారం అందింది.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

కడప: పొద్దుటూరు పట్టణంలోని గోకుల్‌నగర్‌లో మహేశ్వరి (19) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పట్టణ మూడవ టౌన్‌ పోలీసులు చెప్పారు. చాపాడు మండలం గుడివాడకు చెందిన మహేశ్వరికి గోకుల్‌నగర్‌కు చెందిన రవికుమార్‌రెడ్డితో పెళ్లిఅయింది. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను పాము కాటు వేసినట్టు, పాటు చంపి శరీరంవద్ద పడవేశారు. కాగా, తమ కుమార్తెను అదనంపు కట్నం కోసం భర్త రవికుమార్‌, అత్తమామలు వేధించి, హత్య చేసి, పాము కాటుకు గురైనట్టుగా చిత్రికరించారని మహేశ్వరి తల్లిదండ్రులు పోలీసులకు [...]

రామకృష్ణారెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన వెల్దుర్తి జడ్పీటీసీ ఉప ఎన్నిక

మాచర్ల: ఎమ్మెల్సీగా గెలుపొందిన కొద్దిరోజులకే వచ్చిన వెల్దుర్తి జడ్పీటీసీ ఉప ఎన్నిక పి.రామకృష్ణారెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. తన రాజీనామాతో ఖాళీ అయిన జడ్పీటీసీ సీటును కాంగ్రెస్‌ పార్టీ చేజారకుండా అన్ని మార్గాలలో ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో పూర్తిస్థాయి పట్టున్నా ప్రత్యర్థులకు అంతతక్కువగా అంచనా వేయడానికి వీల్లేదన్న కోణంలో ఉన్నారు. తెదేపా తరఫున ఎంపి యోదుగల ప్రత్యేక దృష్టిపెట్టి ఆర్థిక వనరులు సమకూర్చడం, అభ్యర్థి కోటిరెడ్డికి మండలంలో సత్సంబంధాలు ఉండడం తెలుగుదేశానికి కలిసివచ్చిన అదృష్టం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ [...]

జిల్లాలో రూ.189 కోట్లతో అభివృద్ధి పనులు

గుంటూరు: జిల్లాలో 189.44 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని ప్రజారోగ్య శాఖ ఎన్‌.ఇ పి.రామారావు తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, వినుకొండలో 12.37 కోట్ల రూపాయలు, నరసరావుపేటలో 17 కోట్ల రూపాయలు, సత్తెనపల్లిలో 205 కోట్ల రూపాయలు, బాపట్లలో 15.31 కోట్ల రూపాయలు, పొన్నూరులో 18 కోట్ల రూపాయలు, తెనాలిలో 19.51 కోట్ల రూపాయలతో తాగునీటి పథకం అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన చెప్పారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకుల పైపు విస్తరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. [...]

టీటీడీ అవినీతి వ్యవహారంపై దద్దరిల్లిన సభ

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై సోమవారం శాసనసభను కుదిపివేసింది. పాలకపక్షాల, ప్రతిపక్షాల వాదోపవాదాల మధ్య సభ వేడెక్కిపోయింది. టీటీడీ అవినీతి వ్యవహారంపై సభా సంఘాన్ని వేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. అందుకు ప్రభుత్వం తిరస్కరించడంతో సభ నుండి టీడీపీ, పీఆర్పీ, టీిఆర్‌ఎస్‌, సీపీిఎం, బీజేపీి పార్టీలు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, సభ నుండి వాకౌట్‌ చేశాయి. సోమవారం శాసనసభలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నగల అవినీతిపై పాలక విపక్షాలు సుదీర్ఘంగా చర్చించాయి. ముందుగా తెలుగుదేశం [...]

సాగర్‌ నీటిని పంటలకు విడుదల చేయాలి: కోడెల

వినుకొండ (గుంటూరు): వినుకొండ ప్రాంత పరిధిలోని సుమారు 8లక్షల ఎకరాల భూమికి నాగర్జున సాగర్‌ జలాలను విడుదల చేయాలని మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నర్సారావుపేట టిడిపి కార్యాలయంలో జరిగిన టెలికాన్పరెన్సులో ఆయన మాట్లాడుతూ, తమది రైతు ప్రభుత్వమని చెపుకుంటున్న ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, ఖరీఫ్‌ ముగుస్తున్న నీటిని విడుదల చేయలేకపోవడం శోచనీయమని అన్నారు. 2003 -04 టిడిపి ప్రభుత్వం, సాగర్‌ రిజర్వాయర్‌లో నీటి పరిమానం అశించిన విధంగా లేకపోయిన సాగునీటిని [...]

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఆరు మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి… నెల్లూరుపాలెం నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వస్తున్న ఆటోను, ఆత్మకూరు నుంచి ఉదయగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సు సెయింట్‌మెరి స్కూల్‌ వద్ద ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. [...]

Follow

Get every new post delivered to your Inbox.