హైదరాబాద్: ఆర్ధిక మంత్రి రోశయ్య వ్యాఖ్యలు అసెంబ్లీలో సెగలను రగిలించాయి. బుధవారం నాటి శాసనసభ మూడో రోజు బడ్జెట్ సమావేశం అర్ధాంతరంగా వాయిదాపడింది. `నువ్వు పెద్ద మగాడివా. మాట్లాడటానికి సిగ్గూ శరం ఉండాలి’ అంటూ తెలుగుదేశం నేత ముద్దుకృష్ణమనాయుడిపై చేసిన వ్యాఖ్యలకు రోశయ్య క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం నేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. అత్యంత అభ్యంతరకరంగా, సభా మర్యాదకు విరుద్ధంగా ఉన్న ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన పట్టుపట్టారు. సభలో రోశయ్య లేరని, తాను [...]
Filed under: వార్తలు | Leave a Comment »




