వివస్తన్రు చేసి క్షుద్ర పూజలు


ముస్తాబాద్‌: కుటుం బంలోని అరిష్టాలు తొలగిపోవాలంటే మంత్రించి యంత్రాలు ఇంటిలో కడ ితే తొలగిపోతాయి. కడుపునొప్పి తగ్గాలంటే జీడి గింజలు, నిమ్మకా యలు మంత్రించి ఇస్తా కడుపు నొప్పి తగ్గుతుంది. అనారోగ్యం బారిన పడిన ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి 5 వే లు సొమ్ము చేసుకొని, మహిళను వివస్త్ర చేసి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి తాళ్లతో బంధించి దేహశుద్ది చేసిన సంఘటన మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో జరిగింది. బాధితురాలు కొమ్మెట లక్ష్మీ, భర్త నర్సింలు తెలిపిన వివరాల ప్రకారం గత ఆదివారం బాధితురాలు లక్ష్మీ ఇంటికి వచ్చి ఇంట్లో క్షుద్ర పూజలు చేయనారంభించాడు.

నిమ్మకాయలు, జీడి గింజలు తెప్పించి తలపై పెట్టి అగ్గి రవ్వలతో పొగ వేస్తూ, నీ బొమ్మ పెట్టి నీ పాలోడు మంత్రం చేయిం చాడు. నీ ప్రాణానికే ముప్పు అని నీకు శాంతి చేయాలని నామాపూర్‌ గ్రామానికి చెందిన చిరు వ్యాపారి మహమ్మద్‌ రహమాన్‌ క్షుద్ర పూజలు ఆరంభించాడు. ఎవరూ చూడ కూడదని తలుపులు మూసివేశాడు. అంత వరకే గుర్తుందని కొంత సేప టికి లేచి చూసే సరికి ఒంటిపై బట్టలు లేవని చెప్పింది. ఊరుకు వెళ్లిన కొడు కులకు చెప్పలేక మానసిక క్షోభకు గురౌతుంది. ఏమైందని ఇంటి పక్క వారు అడగటంతో విషయం బయట పడింది.

నామాపూర్‌లో గల మాంత్రి కున్ని ఇంటి వద్దకు వెళ్లి కట్టిన యం త్రాలు తీసి వేయడానికి రమ్మనగా రాకపోవడంతో బాధితురాలి తరపున బంధువులు తాళ్లతో కట్టి ఆటోలో చిప్పలపల్లికి తీసుకవచ్చారు. రహమా న్‌ కుటుంబ సభ్యులు జరిగిన విష యంపై వ్యక్తి కిడ్నాప్‌ చేసుకొని వెళ్లా రని చెప్పడంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్‌ఐ సి.విజయ్‌రాజ్‌ను అడుగగా బాది తురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఎవరైన క్షుద్ర పూజలు చేసి కుటుంబాన్ని,వారి ఆరోగ్యాన్ని బాగు పరుస్తామని అపరిచితులు చెప్పే మాటలు నమ్మి ఇండ్లలోకి రానివ్వద్దని ప్రజలకు సూచించారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.