జులై 10, 2009...05:07

నిర్మలమ్మను ఆదుకుంటాం

Jump to Comments

జడ్చర్ల‌: కిష్టారం గ్రామంలో అర్హత ఉండి వికలాంగుల పెన్షన్‌ అందని నిర్మలమ్మను అన్ని విధాల ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే మల్లు రవి తెలిపారు. విధినెదిరించన నిర్మలమ్మ అంటూ మీడియాలో వచ్చిన కథనాల పట్ల ఆయన స్పందించారు. గ్రామ సర్పంచు పాలెం సుదర్శన్‌గౌడ్‌ తోపాటు ఎంపీపీ నిత్యానందం, జిల్లా ప్రణా ళికా సంఘ సభ్యుడు బుక్కావెంకటేశ్‌లను నిర్మలమ్మ వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అక్కడే ఆయన హైదరాబాద్‌ నుంచి విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు.

తమ ప్రభుత్వం లక్ష్యం అర్హులైన వారందరికీ పెన్షన్లు అందించడమేనన్నారు. అయితే ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఇలాంటి వారికి అందలేదని, వెంటనే తాము అధికారులతో చర్చించి పింఛన్‌ జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామ న్నారు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఆదుకోవాలో నిర్ణయి స్తామన్నారు. బాధితురాలికి పింఛన్‌ అందించడంతో పాటు కూతురు నవనీతకు విద్యకోసం సాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచు, ఎంపీపీ లు బాధితురాలి వివరాలు తెలుసుకున్నారు.

ప్రత్యుత్తరమిమ్ము