జులై 10, 2009...05:05

చిరుత గోళ్లకోసం వెళితే కలప దొరికింది

Jump to Comments

మణుగూరు: చిరుతను చంపిన నిందుడి సమాచారం మేరకు దాని గోళ్లను వెతక డానికి వెళ్లిన అటవీ అధికారులకు రూ.5 లక్షల విలు వచేసే కలప అక్రమ నిల్వలు దొరికాయి.. ఈ సంఘటన మణుగూరు పాత రైల్వే క్వార్టర్లుతో చోటు చేసుకుంది.. కలపను స్వాధీనం చేసుకొని వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు..

ఇటీవల చిరుతను చంపి నిందుతుడు యిచ్చిన స మాచారంతో చిరుతగోళ్ల కోసం అటవీ శాఖ పా ల్వంచ సబ్‌ డిఎఫ్‌వో బెనర్జీ ఆధ్వర్యంలో కూనవరం రైల్వేగేట్‌ సమీప పాత రైల్వే క్వార్టర్స్‌కు ఆనుకుని ఉ న్న రైల్వే కాంట్రాక్టర్‌ బంగారు రాజు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పక్కనే ఉన్న రైల్వే క్వార్టర్స్‌లోకి తొంగి చూశారు. అందులో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన కలప దిమ్మెలు కన్పించాయి. దీంతో అ నుమానం వచ్చిన అటవీశాఖ అధికారులు తలుపులు పగలకొట్టి చూడగా అన్ని క్వార్టర్స్‌లో కలిపి సూ మారు రూ. 5 క్షల విలువగల టేకు, మారుజాతి కలప దిమ్మెలు కనిపించాయి. వాటిని వారు స్వాధీనం చేసుకొని కలప వ్యాపారి ప్రకాశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో అశ్వాపురం ఫారెస్టు రేం జర్‌ వీరభద్రరావు, సెక్షన్‌ ఆఫీసర్‌ అరుణ, 15 మంది సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా అక్రమంగా కలప ను నిల్వ చేసిన వ్యాపారికి స్థానిక అటవీ అధికారుల అండతో పాటు ఇందులో రైల్వే అధికారులకు కూడా సంబంధాలు ఉన్నట్లు అట వీశాఖ అధికారులు అనూమానం వ్యక్తం చేశారు.

చిరుత గోళ్ల కోసం సోదాలు..

చిరుత గోళ్ల కోసం గురువారం దాన్ని చంపిన నింది తుడు యిచ్చిన సమాచారం మేరకు రైల్వే కాంట్రాక్టర్‌ బంగారాజు ఇంట్లో అటవీశాఖ అధికారి బెనర్జీ ఆధ్వ ర్యంలో సోదాలు చేపట్టారు. ఆ సమయంలో ఫ్రీజ్‌లో దాచిన అడవీ జంతువు మాంసం బయటపడింది. దీంతో కాంట్రాక్టర్‌ బంగారు రాజును అదుపులోకి తీసుకున్నారు.

ప్రత్యుత్తరమిమ్ము