జులై 10, 2009...05:07

ఇందిరమ్మ ఇళ్ల అవినీతిపై విచారణ

Jump to Comments

గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ పథకం అమలులో జరిగిన అవినీతి అక్రమాలపై ఎట్టకేలకు థర్డ్‌పార్టీ ఎంకై్వరీ ప్రారంభమైంది. ఈ మేరకు గురువారం ఉదయ్‌కుమార్‌, నవీన్‌ కుమార్‌, రాజేష్‌కుమార్‌ల నేతృత్వంలో 6వ వార్డు పరిధిలో ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించారు. అడుగడుగునా విచారణ అధికారులకు లబ్ధిదారులు తమకు జరిగిన అన్యాయం గురించి పూసగుచ్చినట్లు వివరించారు.

ఇళ్ల నిర్మాణం జరుగకున్నా తమ పేరిట బిల్లులు డ్రా చేసుకున్నారని కొంద రు, తాము ఇళ్ల నిర్మాణం చేసుకున్నా బిల్లులు నేటికీ అందలేదని మరి కొందరు విచారణ అధికారుల దృష్టికి తెచ్చారు. తమ వద్దనున్న సమా చారంతో అధికారులు విచారణ చేస్తుండడం పలు అనుమానాలకు తావి స్తోంది. కేవలం లబ్ధిదారుల వద్ద ఉన్న బ్యాంకు పాస్‌పుస్తకాల ఆధారంగా విచారణ చేస్తున్నారే తప్ప మహిళ సంఘాలు ఇళ్ల బిల్లులను డ్రా చేసుకున్న అంశంపై విచారణ చేపట్టకపోవడంతో వార్డులోని తెలుగుదేశం నాయ కులు పులిపాటి వెంకటేష్‌ తదితరులు ఆక్షేపించారు. విచారణను తూతూ మంత్రంగా ముగించాలనే ఉద్దేశంతోనే నిర్వహిస్తున్నారే తప్ప లబ్ధిదారు లకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఏ కోశానా కన్పించడంలేదన్నారు. వార్డులో ఉన్న మహిళా సంఘం అధ్యక్షురాలు, వార్డు కౌన్సిలర్లు కలిసి ఇందిరమ్మ పథకంలో బోగస్‌ లబ్ధిదారులను సృష్టించి వందలాది ఇళ్ల బిల్లులను డ్రా చేసుకున్నారని విచారణ అధికారుల దృష్టికి తెచ్చారు.

ఓ వైపు విచారణ జరుగుతుండగా, విచారణ కొనసాగిస్తున్న అధికారులు తమ సెల్‌ఫోన్లతో హౌసింగ్‌ అధికారులు, వార్డు కౌన్సిలర్‌కు ఎప్పటికప్పు డు సమాచారాన్ని అందజేస్తున్నారని వార్డు ప్రజలు ఆరోపించారు. విచారణ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని బిల్లులు డ్రా చేసుకున్న వారు దర్జాగా తిరుగుతుండగా ఏ పాపం ఎరుగని తాము భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణ బిల్లులను చెల్లించాల్సి వస్తుందేమోనని వాపోయారు. ఏదేమైనా పట్టణంలో థర్డ్‌పార్టీ ఎంకై్వరీ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పలువురు భుజాలు తడుముకుంటుండగా అక్రమాలు చేసిన వారు దర్జాగా ఉండడం గమనార్హం. థర్డ్‌పార్టీ ఎంకై్వరీ వల్ల తమకు ఏమీ జరగదనే ధీమాతో హౌసింగ్‌ అధికారులు ఉండడం కొసమెరుపు.

ప్రత్యుత్తరమిమ్ము