జులై 10, 2009

పరువు తీస్తున్న కొట్లాటలు

హైదరాబాద్: కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే తయారయింది. అత్తెసరు మార్కులతోనే అధికారం దక్కడానికి చాలా నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకుల ధిక్కారమే కారణమని విశ్లేషించిన అధినాయకత్వం జిల్లాల వారీ సమీక్షలు ప్రారంభించింది. పార్టీ అభ్యర్థుల ఓటమికి పనిచేసిన వారి భరతం పట్టడానికి ఇదే మంచి మార్గమని పీసీసీ అధ్యక్షుడు డిఎస్, ముఖ్యమంత్రి వైఎస్ జలిమిగా నిర్ణయించారు. వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పడం మాటేమోగాని ఈ సమీక్షా సమావేశాల్లో కాంగ్రెస్ వర్గాలు [...]

జులై 10, 2009

ఇందిరమ్మ ఇళ్ల అవినీతిపై విచారణ

గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ పథకం అమలులో జరిగిన అవినీతి అక్రమాలపై ఎట్టకేలకు థర్డ్‌పార్టీ ఎంకై్వరీ ప్రారంభమైంది. ఈ మేరకు గురువారం ఉదయ్‌కుమార్‌, నవీన్‌ కుమార్‌, రాజేష్‌కుమార్‌ల నేతృత్వంలో 6వ వార్డు పరిధిలో ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించారు. అడుగడుగునా విచారణ అధికారులకు లబ్ధిదారులు తమకు జరిగిన అన్యాయం గురించి పూసగుచ్చినట్లు వివరించారు.
ఇళ్ల నిర్మాణం జరుగకున్నా తమ పేరిట బిల్లులు డ్రా చేసుకున్నారని కొంద రు, తాము ఇళ్ల నిర్మాణం చేసుకున్నా బిల్లులు నేటికీ [...]

జులై 10, 2009

నిర్మలమ్మను ఆదుకుంటాం

జడ్చర్ల‌: కిష్టారం గ్రామంలో అర్హత ఉండి వికలాంగుల పెన్షన్‌ అందని నిర్మలమ్మను అన్ని విధాల ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే మల్లు రవి తెలిపారు. విధినెదిరించన నిర్మలమ్మ అంటూ మీడియాలో వచ్చిన కథనాల పట్ల ఆయన స్పందించారు. గ్రామ సర్పంచు పాలెం సుదర్శన్‌గౌడ్‌ తోపాటు ఎంపీపీ నిత్యానందం, జిల్లా ప్రణా ళికా సంఘ సభ్యుడు బుక్కావెంకటేశ్‌లను నిర్మలమ్మ వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అక్కడే ఆయన హైదరాబాద్‌ నుంచి విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు.
తమ ప్రభుత్వం లక్ష్యం అర్హులైన వారందరికీ పెన్షన్లు [...]

జులై 10, 2009

చిరుత గోళ్లకోసం వెళితే కలప దొరికింది

మణుగూరు: చిరుతను చంపిన నిందుడి సమాచారం మేరకు దాని గోళ్లను వెతక డానికి వెళ్లిన అటవీ అధికారులకు రూ.5 లక్షల విలు వచేసే కలప అక్రమ నిల్వలు దొరికాయి.. ఈ సంఘటన మణుగూరు పాత రైల్వే క్వార్టర్లుతో చోటు చేసుకుంది.. కలపను స్వాధీనం చేసుకొని వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు..
ఇటీవల చిరుతను చంపి నిందుతుడు యిచ్చిన స మాచారంతో చిరుతగోళ్ల కోసం అటవీ శాఖ పా ల్వంచ సబ్‌ డిఎఫ్‌వో బెనర్జీ ఆధ్వర్యంలో కూనవరం రైల్వేగేట్‌ సమీప పాత [...]

జులై 10, 2009

గొత్తికోయలను ఆదుకుంటాం

ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టం నుండి ఖమ్మం జిల్లాకు వలస వచ్చిన గొత్తికోయలను అన్ని విధాలుగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్‌ వి.ఉషారాణి పేర్కొన్నారు. నేషనల్‌ కమి షన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌రైట్స్‌ సభ్యులు, జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి ఛత్తీస్‌గఢ్‌ నుండి వలస వచ్చిన గొత్తికోయల పిల్లలను, మహిళలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. [...]