జులై 9, 2009

సానియా ఇంటిముందు మరో యువకుడి హడావుడి

హైదరాబాద్‌: టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఇంటిముందు గురువారం మరో యువకుడు హడావుడి చేశాడు. ఐదేళ్లుగా సానియాను ప్రేమిస్తున్నానని, ఆమెతో మాట్లాడనిదే అక్కడినుంచి కదలనని అంటూ ఆమె ఇంటి ముందు ధర్నా చేస్తున్న యాదవ్‌సింగ్‌ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిది ఉత్తరప్రదేశ్‌ అని తెలిపారు.

జులై 9, 2009

భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ భవనంపై నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థిని దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని భోజిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న తేజస్వినిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

జులై 9, 2009

అమర్‌నాథ్‌ సమీపంలో కూలిన హెలికాప్టర్‌

న్యూఢిల్లీ: అమర్‌నాథ్‌కు యాత్రికులను చేరవేసే ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. హెలికాప్టర్‌ లాండింగ్‌ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ చనిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న నలుగురు యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

జులై 9, 2009

‘స్వలింగ సంపర్కం’ కేసులో కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూడిల్లీ: స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ ఢీల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జ్యోతిష్యుడు సురేష్‌కుమార్‌ కౌషల్‌ వేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20లోపు సమాధానం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రకృతివిరుద్ధమైన ఇలాంటి చర్యలను నిషేధించాలని కౌషల్‌ సుప్రీంలో పిటీషన్‌ వేశారు. జంతువులు కూడా స్వలింగ సంపర్కానికి పాల్పడవన్నారు. స్వలింగ సంపర్కం వల్ల హెచ్‌ఐవీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నిరూపణ [...]

జులై 9, 2009

ఈవీఎంలపై సుప్రీంలో పిటీషన్‌

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ జనచైతన్య వేదిక సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు నివృత్తి చేసే వరకూ వాటిని ఎన్నికల్లో ఉపయోగించకుండా నిలిపివేయాలంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈవీఎంలపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పిటీషన్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.