జులై 7, 2009

యాసిడ్‌ దాడులపై సుప్రీం సిరీయస్‌

న్యూఢిల్లీ: దేశంలో కొనసాగుతున్న యాసిడ్‌ దాడుల పరంపరపై మంగళవారం సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యాసిడ్‌ దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడంలో జాప్యం జరగడానికి గల కారణాలు తెలపాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనితో కోర్టుకు వివరణ ఇవ్వడానికి ఆరు వారాల గడువు కావాలని అదనపు సోలిసిటర్‌ జనరల్‌ మోహన్‌ కోర్టును అభ్యర్థించారు. దీనికి కోర్టు అంగీకారం తెలిపింది. తనపై జరిగిన యాసిడ్‌ దాడి వలన అందవిహీనంగా తయారయ్యానని ఢిల్లీకి చెందిన [...]

జులై 7, 2009

ఫొటోగ్రఫీలో గంగాధర్‌కు రాష్ట్ర అవార్డు

కమ్మర్‌పల్లి: ఖమ్మం ఫొటో ఆర్ట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన నాల్గవ రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ వర్క్‌ షాప్‌లో.. కమ్మర్‌పల్లికి చెందిన లుక్క గంగాధర్‌కు కన్సోలేషన్‌ బహుమతి లభించింది. ఐటిడిఎ, టూరిజం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో.. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు భద్రాచలంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా \’గిరిజనుల జీవన విధానం – టూరిజం\’ అనే అంశాలపై గంగాధర్‌ పలు ఫొటోలు ప్రదర్శించి, బహుమతిని సొంతం చేసుకున్నారు.