హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అసెంబ్లీ కవరేజికి డీఎస్‌ఎస్‌జిలను నిషేధించారు. ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రాంగణంలో ఎలాంటి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాలు చేయరాదు. ప్రస్తుతం అసెంబ్లీ ఆవరణంలో ఉన్న వీడియో పాయింట్‌ను పబ్లిక్ గార్డెన్‌కు తరలించనున్నారు. సభ ప్రాంగణంలోకి లాబీల్లోనూ కెమెరాలు, వీడియో కెమెరాలపై నిషేధం విధించనున్నారు. ఇక నుంచి అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను ప్రభుత్వం ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. సమావేశాల కవరేజికి ప్రస్తుతం ఉన్న మీడియా [...]
జులై 6, 2009
ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీల సమావేశం
న్యూఢిల్లీ: రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సమగ్రంగా చర్చించనున్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా తుదికార్యచరణ రూపొందిచనున్నట్లు సమాచారం. రేపు ఆంధ్ర ఎంపీలు రైల్వే మంత్రి మమతా బెనర్జీతో సమావేశం అయి రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు తదితర అంశాలను తెలియజేయనున్నారు.
జులై 6, 2009
యాసిడ్ విక్రయాల క్రమబద్దీకరణ : కేంద్రం
న్యూఢిల్లీ: యాసిడ్ దాడులపై కేంద్రప్రభుత్వం ఇన్నాళ్ళకు మేల్కొంది. తీవ్ర నేరాలకు “యాసిడ్” ఆయుధంగా మారిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా హూంకరించిన తర్వాత ఈ విషయంపై కళ్ళు తెరిచింది. స్వేచ్ఛగా జరుగుతున్న యాసిడ్ విక్రయాలను క్రమబద్దీకరిస్తామని సోమవారం కేంద్రం ప్రకటించింది. ‘యాసిడ్ అమ్మకాలపై కొన్ని పరిమితులు, ఆంక్షలు అవసరం. ప్రస్తుతం ఇది చాలా సులభంగా దొరుకుతోంది’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్, జస్టిస్ పి. సదాశివంలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. “యాసిడ్ దాడి తీవ్రమైన [...]
జులై 6, 2009
బడ్జెట్ ప్రసంగం ముఖ్యాంశాలు
- బడ్జెట్ అంచనా 10, 20, 838 కోట్లు
- సబ్బిడీల భారం రూ.1,11,23 కోట్లు
- వార్షిక వృద్ధి రేటు లక్ష్యం 9 శాతం
- వ్యవసాయ వృద్ధిరేటు లక్షం 4 శాతం. 2009-10కి వ్యవసాయ రుణం రూ. 3.25లక్షల కోట్లు.
- 2014 నాటికి మౌలిక రంగం పెట్టుబడుల లక్ష్యం 9శాతం
- 6.7 శాతానికి పడిపోయిన జీడీపీని 9 శాతానికి పునరుద్ధరిస్తాం.
- మరిన్ని విదేశీ పెట్టుబడులు
- జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంకు రూ. 125,887 కోట్లు. 87 శాతం నిధులు పెంపు
- జాతీయ రహదారులకు [...]
జులై 6, 2009
త్వరలో ఆహార భద్రత బిల్లు
న్యూఢిల్లీ: త్వరలో ఆహార భద్రత బిల్లుకు సంబంధించి చట్టం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ చట్టం కింద 25 కిలోల బియ్యం, మూడు రూపాయలకు కిలో గోధుమలు లభిస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ 2009-10 ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ మాట్లాడుతూ వివిధ వర్గాలను సంప్రదించిన తర్వాత ఆహార భద్రత బిల్లుకు సంబంధించిన చట్టం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ [...]