జులై 5, 2009...18:45

గిరిపుత్రుల గోడు ప్రభుత్వానికి పట్టదా..?

Jump to Comments

దండేపల్లి: ఆధునిక ప్రపంచానికి దూరంగా అటవీ ప్రాంత సమీపంలో నివాసముం టున్న గిరిజనుల బ్రతుకులు ఎన్ని తరాలు మారిన మార్పునకు నోచుకోవడం లేదనే అభిప్రాయాలు వెల్ల డవుతున్నాయి. దండేపల్లి మండలంలోని పలు గిరి జన గ్రామాల రవాణ సౌకర్యాలు లేక ఆభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిపోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..దండేపల్లి మండలంలోని తాళ్ళపేట గ్రామ పం చాయతీ పరిధిలోని జైతుగూడ గ్రామానికి వెళ్లే మద్య ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఊరి గ్రామ ప్ర జలు అధికారులకు, ప్రజాప్రధినిధులకు ఎన్నో సార్లు వంతెన గూర్చి మొరపెట్టుకుంటే ఎట్టకేలకు ఎన్నిక లకు ముందు స్పందించి వంతెన నిర్మాణానికి నిధు లు మంజురు చేశారు. నిధులు మంజురై ఆరు నెలలు గడుస్తున్న ఇంత వరకు పనులు ప్రారంభిం చకపోవడం పట్ల గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.

నిత్యవసర సరుకుల కోసం గిరిజనులు ప్రతి రోజు తాళ్ళపేటకు రాకపోకలు కోనసాగిస్తున్నారు. ఆరోగ్యరిత్యా, ప్రమాదవశాత్తు, అత్యవసర సమయా ల్లో ఈ వాగు దాటి వెళ్ళాలంటే గిరిజనులు పడే బాధ లు వర్ణనాతీతం. వర్షాకాలంలో ఈగిరిజన గ్రామం తో పూర్తిగా సంబందాలు తెగిపోయాయి. ఈ గూడెం లోని గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో వాగు దాటా లంటే సాహసం చేయాల్సిందే. బడీడు పిల్లలు ఈ వాగు దాటకపోవడంలో గిరిపుత్రులకు విద్య అందని ద్రాక్ష గానే మిగిలిపోతుంది. వర్షా కాలం సమయంలో ఆరోగ్య జాగ్రతలు తెలియచెప్పే అంగన్‌వాడీ కార్య కర్తలు ఈ వాగు దాటకపోవడంతో గిరిపుత్రులు అనారోగ్య పరిస్థి తులను ఎదుర్కుంటున్నారు.

వాగుపై వంతెన నిర్మాణానికి రూ లక్షలు మంజురు కాగా సుమారు ఆరు నెలల క్రిందట అప్పటి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావ్‌ చేతుల మీదుగా శంకు స్థాపన జరిగింది. శంకుస్థాపన చేశారు కానీ పనులెప్పుడు ప్రారంభిస్తారోనని గిరిపుత్రులు ఆశగా ఎదుచూస్తు న్నారు. ఈ సారి కూడ బాధలు తప్పవా అంటూ గూడెం వాసులు ఆవేదన చేందుతున్నారు. ఎన్నికల వేల ఒట్లకోసం శంకుస్థానలకే పరిమితమైన రాజకీయ నాయకులపై గూడెం వాసులు మండిపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పనులు జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ప్రత్యుత్తరమిమ్ము