జులై 5, 2009

గిరిపుత్రుల గోడు ప్రభుత్వానికి పట్టదా..?

దండేపల్లి: ఆధునిక ప్రపంచానికి దూరంగా అటవీ ప్రాంత సమీపంలో నివాసముం టున్న గిరిజనుల బ్రతుకులు ఎన్ని తరాలు మారిన మార్పునకు నోచుకోవడం లేదనే అభిప్రాయాలు వెల్ల డవుతున్నాయి. దండేపల్లి మండలంలోని పలు గిరి జన గ్రామాల రవాణ సౌకర్యాలు లేక ఆభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిపోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..దండేపల్లి మండలంలోని తాళ్ళపేట గ్రామ పం చాయతీ పరిధిలోని జైతుగూడ గ్రామానికి వెళ్లే మద్య ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఊరి గ్రామ ప్ర జలు అధికారులకు, [...]

జులై 5, 2009

అటవీ హక్కు పత్రాలున్నా…!

ఇంద్రవెల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనాధిగా గిరిజనులు సాగు చేస్తున్న అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వడం ప్రారంభించి పది రోజులు పూర్తిగాగ ముందే అటవీ అధికారుల జులుం ప్రారంభములోన సంఘటన జరిగింది. ఈ సంఘటన మండలంలోని దస్నాపూర్‌ శివారులోని కోయల్‌ పాండ్రి గ్రామానికి చెందిన కరాలే లింబాజీ పై జరిగింది. సదరు రైతు లింబాజీ మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ తన తండ్రుల కాలం నుండి సాగు చేస్తున్న అటవీ భూమిపై తనకు హక్కులు కల్పిస్తూ [...]

జులై 5, 2009

వ్యాసపూర్ణిమకు ముస్తాబైన బాసర

బాసర: చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రం వ్యాసపూర్ణిమ ఉత్సవాల కోసం ముస్తాబయ్యింది. దేవాదాయ దర్మాదాయ శాఖ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకోసం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఈనెల 7న బాసరలో గురుపౌర్ణమి వేడుకలకు ఆలయాన్ని అందంగా తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గురుపౌర్ణిమ సందర్బంగా మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక , ఆరాధన కార్యక్రమాలను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తుంటారు. బాసరలోని వ్యాసమహర్షి ఆలయంలో, గోదావరి తీరంలో ఉన్న శివాలయంలో దేవాదాయ శాఖ యజ్ఞం కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది.
ఈసారి కూడా [...]

జులై 5, 2009

తూర్పున మావోయిస్టు కదలికలు

మంచిర్యాల: తూర్పు జిల్లాలో మావోయిస్టు కదలికలున్నట్లు ఈ మధ్యకాలంలో సికాస కార్యదర్శి జంజిపెల్లి శ్రీధర్‌ పేరుతో వెలువడుతున్న ప్రకటనల ద్వార స్పష్టమవుతుంది. మావోయిస్టులకు కంచుకోట అయిన తూర్పు ప్రాంతం గత కొంత కాలంగా స్థబ్దుగా ఉండిపోయింది. గత వారం రోజులుగా మంచిర్యాల డివిజన్‌లో మావోయిస్టులపై చర్చ కొనసాగుతుంది. మందమర్రిలోని పలువురు రాజకీయనాయకులపై సికాస కార్యదర్శి జంజిపెల్లి శ్రీధర్‌ వార్నింగ్‌ ఇస్తు విడుదల చేసిన ప్రకటన స్థానికంగా ప్రకంపనలను సృష్టించింది.డివిజన్‌ పరిధిలో పలు పంచాయితీలు చేస్తు అక్రమ సంపాధనకు [...]

జులై 5, 2009

వరుణ్‌కు ప్రాణాపాయం : మేనకాగాంధీ

న్యూఢిల్లీ: తన కుమారుడు వరుణ్‌ గాంధీకి ప్రాణాపాయం ఉందంటూ బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాసింది. వరుణ్‌ భద్రకు సంబంధించి పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోయిందని ఆమె మండిపడ్డారు. వరుణ్‌ తరపు న్యాయవాది హత్యకు కుట్రపన్నిన చోటాషకీల్‌ అనుచరులను ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతిని ఆమె ప్రధానికి గుర్తు చేశారు. వరణ్‌ను కాంగ్రెస్‌ రాజకీయ శత్రువుగా భావిస్తోందని ప్రధానికి రాసిన లేఖలో మేనక పేర్కొంది. వరుణ్‌ పిరికి [...]