నిప్పుల విత్తనాలను చల్లి మంటలను పండించిన నేల… సాయుధ రైతాంగ ఉద్యమంతో రక్త పతాకాలను ఎగరేసిన వీర భూమి… దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసి భారత చరిత్రలో సగర్వమైన పుటను కేటాయించుకున్న గ్రామం… భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సస్ట్-లెనినిస్ట్) సాయుధ కార్యకర్తకు నక్సలైట్ బిరుదు ఇచ్చి నిఘంటవులో కొత్త పదాన్ని చేర్చిన నక్సల్ బరీ… గ్రామం. తాజాగా లాల్ ఘడ్ మావోయిస్టు ఉద్యమం దేశాన్ని కుదిపేస్తున్నప్పుడు అక్కడకు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న నక్సల్ [...]
జులై 4, 2009
స్వలింగ జంట పోరు
కర్నూలు: ఈ ఉదంతం విడిపోవడాలు, తిరిగి కలుసుకోవడాలతో కూడుకున్న మామూలు ప్రేమకథలా పైకి కనిపిస్తున్నది. కాని ఈ సంబంధం తిరిగి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దంపతులు పోలీసుల సాయంతో గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు చీలిక కోసం పట్టుబట్టుతుండగా మరొకరు పునస్సమాగమం కోసం ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే, ఈ వ్యవహారం గురించి కూలంకషంగా తెలుసుకున్న పోలీసులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ‘ఓ భగవంతుడా! వారిద్దరూ మహిళలే’ అని అంటూ వారు తలలు పట్టుకుంటున్నారు.
ఆరు మాసాల క్రితం నాగలక్ష్మి, [...]
జులై 4, 2009
రహదారులకు మహర్దశ
న్యూఢిల్లీ: అన్నిరంగాలలనూ ఆర్ధికంగా చైతన్యవంతం చేయడంలో, వనరులను అందుబాటులోకి తీసుకురావడంలో రహదారులు దోహదపడతాయని, దేశ ఆర్ధిక ప్రగతిలో రహదారులు కీలకమైన భూమికను పోషిస్తాయని, అందుకే రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి కమల్ నాథ్ వెల్లడించారు. ఇక నుంచి రోజుకు 20 కిలోమీటర్ల రహదారులను ప్రతీ రోజు నిర్మించాలన్నది తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. యూపియే ప్రభుత్వం గడిచిన ఐదేళ్ళలో రోజుకు కేవలం రెండు కిలోమీటర్ల [...]
జులై 4, 2009
జిందాల్ పై జేపి మరో లేఖ
హైదరాబాద్: జిందాల్ అల్యూమినా కర్మాగారం కోసం చేసిన భూసేకరణలో అక్రమాలపై ఇప్పటికైనా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి లోక్ సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ మరో లేఖ రాశారు. అక్రమాలపై విచారణ జరిపి బాధిత రైతులకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. జిందాల్ పరిశ్రమ భూసేకరణ అక్రమాలపై గత ఏడాది సెప్టెంబర్ 8న అన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ [...]
జులై 4, 2009
నాన్ స్టాప్ రైళ్ళు అసాధ్యం
ముంబై: దేశంలోని ప్రధాన మెట్రో నగరాల మధ్య 12 నాన్ స్టాప్ (డ్యురోంటో రైళ్ళు)ను ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ శుక్రవారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ సగర్వంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాని రైల్వే అధికారులు మాత్రం ఇది అసాధ్యం అంటున్నారు. నాన్ స్టాప్ రైళ్ళను నడపడం సాంకేతికంగా అసాధ్యం అని వారు పెదవి విరుస్తున్నారు. నాన్ స్టాప్ రైళ్ళ వలన రైల్వేకు ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ ఉండబోదని చెబుతున్నారు. రైల్వే మంత్రి [...]