జులై 3, 2009...13:10

రైల్వే బడ్జెట్‌లో ఎపీ ఎంపీల ఇజ్జత్‌బోయింది

Jump to Comments

న్యూఢిల్లీ: మళ్లీ అన్యాయం.. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మమతా బెనర్జీ ముష్టి వేశారు. కేవలం ఒకే ఒక్క కొత్త రైలు, రెండే రెండు కొత్త రైల్వే లైన్లు ఆంధ్రప్రదేశ్‌కు పారేసిన ముష్టి. దీంతో మన రాష్ట్రానికి చెందిన 32 మంది ఎంపీల పరువు మరోసారి ఢిల్లీ వీధుల్లో పోయింది. ఎలాగూ కేంద్ర కేబినెట్‌లో అన్యాయం జరిగినందున రైల్వే బడ్జెట్‌లోనన్న సైరైన న్యాయం చేస్తారనుకున్న మన రాష్ట్రానికి మళ్లీ మమత మొండి చేయి చూపించారు. ఇదేంటని నిలదీసిన మన ఎంపీలకు సమయం లేనందునే ఇలా జరిగిందని నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారు.

ప్రత్యుత్తరమిమ్ము