న్యూఢిల్లీ: రైల్వే మంత్రి మమతాబెనర్జీ పేదల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రశంసించారు. ప్రయాణికులపై అదనపు భారం వేయకుండా, ఛార్జీలు పెంచకుండా ప్రజలు మెచ్చేలా బడ్జెట్‌ను రూపొందించారని అన్నారు. తక్కువ సమయంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. ప్రైవేట్ సహకారంతో రైల్వేస్టేషన్లు అధునికీకరణ యోచన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య ఆరోగ్యకర భాగస్వామ్యానికి ప్రతీక అని అన్నారు. అంతకుముందు స్పీకర్ మీరాకుమారి మమతా బడ్జెట్ ప్రసంగం అనంతరం సభను రెండున్నర గంటల పాటు వాయిదా వేశారు.
జులై 3, 2009...13:14
పేదల బడ్జెట్: మన్మోహన్
Jump to Comments