జులై 3, 2009

పేదల బడ్జెట్‌: మన్మోహన్‌

న్యూఢిల్లీ: రైల్వే మంత్రి మమతాబెనర్జీ పేదల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రశంసించారు. ప్రయాణికులపై అదనపు భారం వేయకుండా, ఛార్జీలు పెంచకుండా ప్రజలు మెచ్చేలా బడ్జెట్‌ను రూపొందించారని అన్నారు. తక్కువ సమయంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. ప్రైవేట్‌ సహకారంతో రైల్వేస్టేషన్లు అధునికీకరణ యోచన ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల మధ్య ఆరోగ్యకర భాగస్వామ్యానికి ప్రతీక అని అన్నారు. అంతకుముందు స్పీకర్‌ మీరాకుమారి మమతా బడ్జెట్‌ ప్రసంగం అనంతరం సభను రెండున్నర గంటల పాటు వాయిదా వేశారు.

జులై 3, 2009

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప

హైదరాబాద్‌: అవినీతి నిరోధక సంస్థ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కారు. ఏపీ వికలాంగుల కార్పొరేట్‌ సొసైటీ ఎండీ అమృతయ్య నివాసంపై ఈ రోజు ఏసీబీ దాడులు చేసింది. హబ్సీగూడలోని ఆయన ఇంటిపై అధికారుల దాడులు చేసి సోదాలు నిర్వహించారు. సుమారుగా రూ.2.50 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

జులై 3, 2009

విజయనగరంజిల్లాలో భారీ డంప్‌

విజయనగరం: విజయనగరం జిల్లాలో పోలీసుల భారీ డంప్‌ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఎలింపేట పోలీస్‌స్టేషన్‌ పరిధి గిరిజన గ్రామం కొయ్యపాక అడవుల్లో ఏకే 47 తూటాలు, డిటోనేటర్లు, స్టీల్‌ క్యాన్లు తదితర పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం పుస్తకాలను కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జులై 3, 2009

రైల్వే బడ్జెట్‌లో ఎపీ ఎంపీల ఇజ్జత్‌బోయింది

న్యూఢిల్లీ: మళ్లీ అన్యాయం.. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మమతా బెనర్జీ ముష్టి వేశారు. కేవలం ఒకే ఒక్క కొత్త రైలు, రెండే రెండు కొత్త రైల్వే లైన్లు ఆంధ్రప్రదేశ్‌కు పారేసిన ముష్టి. దీంతో మన రాష్ట్రానికి చెందిన 32 మంది ఎంపీల పరువు మరోసారి ఢిల్లీ వీధుల్లో పోయింది. ఎలాగూ కేంద్ర కేబినెట్‌లో అన్యాయం జరిగినందున రైల్వే బడ్జెట్‌లోనన్న సైరైన న్యాయం చేస్తారనుకున్న మన రాష్ట్రానికి మళ్లీ మమత మొండి చేయి చూపించారు. ఇదేంటని నిలదీసిన మన [...]

జులై 3, 2009

కేంద్ర రైల్వేబడ్జెట్‌ విశేషాలు – 2009

- పేరుతో పేదలకు రూ. 25 లకే (100 కి.మీల వరకు) మంత్లీ పాస్‌
- 50 స్టేషనల్లో అంతర్జాతీయ సౌకర్యాలు
- ప్రైవేట్‌ భాగస్వామ్యులతో రైల్వేస్టేషన్ల అభివృద్ధి
- రైల్వేల అభివృద్ధికి ప్రత్యేత నిపుణుల కమిటీ
- హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బహుళ ప్రయోజనకర సముదాయం
- దూరప్రాంత రైళ్లలో వైద్య సహాయం
- 5వేల పోస్టాపీసుల్లోనూ రైల్వే సాధరణ టికెట్లు అమ్మకం
-200 అదనపు రిజర్వేషన్‌ సెంటర్లు
- స్ర్తీల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు
-వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు
- మహిళల కోసం ప్రత్యేక [...]