హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం దేశప్రజలకు బహుమతి ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తింది. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయని, చమురు ధరలను పెంచి మధ్య తరగతి, అల్పాదాయవర్గాలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లీటరు పెట్రోలు ధర రూ.50 ఉందని, ఇంత ఎక్కువ ధర దేశంలో మరెక్కడా లేదన్నారు. చమురు ధరలు పెరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఎంత మేర పెరుగుతుందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రజా భద్రతా సలహా కమిటీకి, జాతీయ భద్రతా సలహా కమిటీకీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని రావుల విమర్శించారు.
జులై 2, 2009...15:38
చమురు ధరల పెంపుపై మండిపడ్డ తెదేపా
Jump to Comments