జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద ఆర్టీసీ బస్సు, లారీను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
జులై 2, 2009
చమురు ధరల పెంపుపై మండిపడ్డ తెదేపా
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం దేశప్రజలకు బహుమతి ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తింది. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయని, చమురు ధరలను పెంచి మధ్య తరగతి, అల్పాదాయవర్గాలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లీటరు పెట్రోలు ధర [...]
జులై 2, 2009
జర్నైల్ సింగ్‌నుతొలగించిన దైనిక్‌జాగరణ్
న్యూఢిల్లీ: పత్రికా సమావేశంలో హోం మంత్రి పి.చిదంబరంపై బూటు విసిరి సంచలనం సృష్టించిన విలేకరి జర్నైల్ సింగ్‌ను పత్రిక యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. సుమారు పదేళ్లుగా దైనిక్‌జాగరణ్ హిందీ దిన పత్రికలో జర్నైల్ విలేకరిగా పనిచేస్తున్నారు. బూటు విసిరిన సంఘటన అనంతరం యాజమాన్యం అతనికి షోకాజ్ నోటీసు జారీ చేసి నాలుగు నెలల అనంతరం ఉద్యోగం నుంచి తీసేసింది. ఆంతరంగిక దర్యాప్తు నిర్వహించి సింగ్‌ను తొలగించినట్లు పత్రిక యాజమాన్యం ధ్రువీకరించింది. 1984 సిక్కు అల్లర్లకు సంబంధించిన [...]
జులై 2, 2009
బస్సు,ఆటోఢీ: ఇద్దరి మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 12 మందితీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల వీఆర్‌కే కళాశాల వద్ద వేగంగా వస్తున్న బస్సు, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
జులై 2, 2009
సంక్షోభ దేశాలకు రూ.2.95లక్షల కోట్లు
వాషింగ్టన్: ఆర్థిక మాంద్యంతో విలవిల్లాడుతున్న దేశాలకు చేయూతనందించేందుకు తాజా ఆర్థిక సంవత్సరంలో రూ.2,95,000 కోట్ల సాయాన్ని అందజేయనున్నట్లు ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో 54శాతం మేరకు సాయాన్ని పెంచినట్లు వెల్లడించింది. ‘సాయం చేయాల్సిందిగా ఈ ఏడాది వివిధ దేశాల నుంచి పెద్దసంఖ్యలో విజ్ఞప్తులు అందాయి. వచ్చే ఏడాది కూడా మాంద్యం తీవ్రత తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే సాయాన్ని కొనసాగించాలని నిర్ణయించాం’ అని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోలిక్ తెలిపారు. ‘మాంద్యం [...]