జులై 1, 2009...15:04

ప్రతిఘటన నేత అశోక్‌ ఎన్‌కౌంటర్‌

Jump to Comments

వరంగల్‌: నక్సల్స్‌ ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. వరంగల్‌-కరీంనగర్‌ జిల్లా సరిహద్దులో ఏటూరు నాగారం మండలం భూపతిపూర్‌ సమీపంలో పోలీసులకు, ప్రతిఘటన నేతలకు నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అశోక్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి సుధాకర్‌ అలియజ్‌ అశోక్‌ ఖమ్మం జిల్లా గార్లబయ్యారంకు చెందిన వాడు. మృతుల్లో మేడారం దళ కమాండర్‌ చంద్రన్న కూడా ఉన్నాడు. ఘటన స్థలంలో ఓ ఎస్‌ఎల్‌ఆర్‌, రైఫిల్‌, 8ఎంఎం తుపాకీతో పాటు మూడు కిట్‌ బ్యాగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో జిల్లాలో ప్రతిఘటన కనుమరుగైనట్లేనని వరంగల్‌ జిల్లా ఎస్పీ సజ్జనార్‌ తెలిపారు.

ప్రత్యుత్తరమిమ్ము