హైదరాబాద్: తనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష చేస్తున్న కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు, కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీడీపీ ఎమ్మెల్యేలను, నాయకులను హింసించడమే ముఖ్యమంత్రి వైఎస్ పనిగా పెట్టుకున్నారు. రామారావు చేసిన తప్పేంటని, ఒక దళిత ఎమ్మెల్యే అంటే అంత చులకనా అని ప్రశ్నించారు.
జులై 1, 2009
ప్రతిఘటన నేత అశోక్ ఎన్‌కౌంటర్
వరంగల్: నక్సల్స్ ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి అశోక్ ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. వరంగల్-కరీంనగర్ జిల్లా సరిహద్దులో ఏటూరు నాగారం మండలం భూపతిపూర్ సమీపంలో పోలీసులకు, ప్రతిఘటన నేతలకు నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అశోక్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ అలియజ్ అశోక్ ఖమ్మం జిల్లా గార్లబయ్యారంకు చెందిన వాడు. మృతుల్లో మేడారం దళ కమాండర్ చంద్రన్న కూడా ఉన్నాడు. ఘటన స్థలంలో ఓ [...]
జులై 1, 2009
నెల్లూరులో సచిన్‌కు రెండు రేషన్‌కార్డులు
నెల్లూరు: రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా పోట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇండియన్ మాస్టర్ బ్లాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న రెండు తెల్ల రేషన్ కార్డులు బయటపడ్డాయి. బోగస్ కార్డుల ఏరివేతలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. ఇదే కాకుండా భవనాలు, చెట్లు, వాల్ పోస్టర్ల పేరిటా కూడా రేషన్ కార్డులను జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన 2 లక్షల రేషన్‌కార్డుల తనిఖీల్లో 6వేల బోగస్ కార్డులు బయటపడ్డాయి.
జులై 1, 2009
ఆరుగురిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
విజయనగరం: మరోసారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని అలమండలో ఆరుగురిని మావోయిస్టులు బుధవారం ఉదయం కిడ్నాప్ చేశారు. వీరిలో నలుగురు వ్యాపారులతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ సంఘటనలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 30 మంది మావోయిస్టులు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మావోయిస్టులు వారి ఇళ్లపై దాడి చేసి తీసుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.