పదవులు ఊడాయ్

హైదరాబాద్: కేంద్ర సాంకేతిక విద్యా మండలి(ఎఐసిటిఇ) పెద్దలకు కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. అవినీతి కేసులలో ఇరుక్కున్న మండలి సభ్య కార్యదర్శి కె నారాయణరావును ఆ పదవి నుంచి తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన నారాయణరావు మూడేళ్ళ క్రితం మండలి సభ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. దేశంలో సాంకేతిక కళాశాలల అనుమతులకు లక్షల రూపాయలు ముడుపులు స్వీకరిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సిబిఐ చేసిన దాడుల్లో నారాయణరావు రెడ్ హ్యాండెడ్ [...]

`సారీ’ల సభ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నాడు ఆరోగ్యకరమైన వాతావరణం కనిపించింది. ప్రతిపక్ష నాయకులు, అధికార పక్షం నాయకులు, చివరకు సభాపతి కూడా పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నారు. గత మూడు రోజులుగా ఆవేశాలతో వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచారు. పంతాలను, పట్టింపులను పక్కన పెట్టి బడ్జెట్ సమావేశాల నాలుగో రోజును సజావుగా నడుపుకునేందుకు అవకాశం కల్పించారు. సభ ప్రారంభం కాగానే ఒకరి వెంట ఒకరు `సారీ’లు చెబుతుంటే సభ్యులంతా హర్షాద్వానాలు చేశారు. ఈ నాయకులను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ముందుగా [...]

ప్రతిపక్షాల వాకౌట్

హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ హస్టల్ విద్యార్ధులకు సరైన పౌష్టికాహారం అందించడానికి రోజువారీ భత్యాన్ని పెంచాలని శాసనసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికి ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, భారతీయ జనతా పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రజారాజ్యం పార్టీ, తెలంగాణారాష్ట్ర సమితి మాత్రం నిరసన తెలిపాయి. ఈ అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహం మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్దులు ఆకలితో అల్లాడిపోతున్నారని అన్నారు. సరైన ఆహరం లభించక అనారోగ్యాల పాలవుతున్నరని చెప్పారు. [...]

ఇక నుంచి ఐఐటీ వైద్యులు!

న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఇంజినీర్లను తయారు చేసిన ఐఐటీ(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు సామాజిక శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయవాదులను కూడా అందించనున్నాయి. తమ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పేందుకు ప్రైవేట్ భాగస్వాములను ఖరగ్ పూర్ ఐఐటీ ఆహ్వానించింది. ఆస్పత్రి ఏర్పాటైతే ఎంబీబీఎస్ కోర్సును ఇక్కడ ప్రారంభించే అవకాశాలు మెరుగౌతాయి. ”మెడికల్ సైన్స్, టెక్నాలజీ పాఠశాల ఇప్పటికే ఉంది. ఆస్పత్రి అవసరం ఉందని కొంతకాలంగా ఉంది” అని ఖరగ్ పూర్ ఐఐటీ డైరెక్టర్ డీ ఆచార్య తెలిపారు. [...]

‘రావణ్’ షూటింగ్ లో ప్రమాదం

తిరువనంతపురం: ప్రముఖ దర్శకుడు మణిరత్నం పలు అవరోధాల మధ్య ‘రావణ్’ షూటింగ్ ను మళ్లీ సెట్స్ పైకి తీసుకువచ్చినప్పటికీ దురదృష్టం మాత్రం ఇంకా వెన్నాడుతూనే ఉంది. బుధవారం సాయంత్రం కేరళలోని చాలక్కుడి సమీపంలో ఉన్న అతిరప్పలి జలపాతాల వద్ద షూటింగ్ ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ కోసం తీసుకువచ్చిన కుంజు అనే ఏనుగు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఏనుగును లొంగదీసుకునేందుకు ప్రయత్నించిన ట్రయినర్, మావటి ఆండవన్ ను తొక్కి చంపింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోనే ఉన్న [...]

‘రాములమ్మ తప్పుకోవాలి’

మెదక్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మెదక్ లోక్ సభ సభ్యురాలు విజయశాంతి వెంటనే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు రఘునందన్ రావు డిమాండ్ చేశారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైందని ఆయన అన్నారు. మీడియాలో వచ్చే కథనాలపై ఆమె ఎందుకు స్పందించడం లేదని రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి దయ వల్లే ఆమె మెదక్ ఎంపిగా గెలిచారు కనుక ఆ పదవికి [...]

‘జనం మధ్యే ఉద్యమం’

హైదరాబాద్: ఇక నుంచి తాను జనం మధ్య ప్రత్యక్షంగా ఉండి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటానని జనశక్తి రాష్ట్ర కార్యదర్శి కూర దేవేందర్ అలియాస్ అమర్ ప్రకటించారు. ఇంతవరకూ తాను మానసిక పోరాటం మాత్రమే చేశానని, ఇప్పుడు ప్రజా సమస్యలపై భౌతికంగా ఉద్యమాల్లో ఉంటానని చెప్పారు. తెలంగాణలో ఉన్న వారంతా పార్టీలు, సిద్ధాంతాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ఒక్కటై తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాలని అమర్ పిలుపునిచ్చారు. చర్లపల్లి జైలు నుంచి గురువారం మధ్యాహ్నం బెయిలుపై విడుదలైన అమర్ [...]

ఈస్ట్ జోన్ డిసిపిగా స్టీఫెన్

హైదరాబాద్: హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనతో పాటు మరో ఐదుగురు ఐపిఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్టీసి ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ డైరెక్టర్ గా ఉన్న బి.ఎల్. మీనాను హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఐజిగా ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ ఐజిగా ఈశ్వర్ రెడ్డి, ట్రైనింగ్ ఐజిగా జితేందర్, కరీంనగర్ ఎస్పీగా ఎన్.శివశంకర్, అప్పా జాయింట్ డైరెక్టర్ గా [...]

బాబుపై సిఎల్పీ ఫిర్యాదు

హైదరాబాద్: శాసనసభాపతి కిరణ్ కుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసి తెలుగుదేశం నాయకులు చంద్రబాబునాయుడు, గాలి ముద్దుకృష్ణమ నాయుడ సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని కాంగ్రెస్ శాసనసభా పక్షం ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవలని కోరుతూ లిఖితపూర్వకంగా సభా హక్కుల కమిటీకి ఫిర్యాదును అందచేసింది. బుధవారం సభ వాయిదా పడిన అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సిడిని, పత్రికల్లో వచ్చిన వార్తల కటింగ్ లను కూడా ఈ ఫిర్యాదుతో జత చేసింది. స్పీకర్ [...]

ప్రేమ గుడ్డిదే…

ప్రేమ ఎంత మధురం… ప్రియురాలు అంత కఠినం అని సినిమా విషాద గీతాలు పాడుకునే వాళ్ళ సంగతి మనకెందకు లెండి… ప్రేమలో పీకలదాకా కూరుకుపోయిన వాళ్ళ సంగతి ఇది. మహానుభావుడు షేక్స్పియర్ చెప్పినట్టు `ప్రేమ గుడ్డిది’ అని నిరూపించారు పరిశోధకులు. ప్రేమలో నిండా మునిగినవారికి కొంచెం చూపు మందగిస్తుందట! దృష్టిని సక్రమంగా కేంద్రీకరించలేరట… దేనిలో అంటే ప్రస్తుత తన ప్రియురాలు లేదా ప్రియుని కంటే అందమైన వాళ్ళను గమనించడంలోనని తేల్చి చెప్పారు అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో రీసెర్చ [...]

Follow

Get every new post delivered to your Inbox.