అంతరించిన పోయిన అడవులు

ఖమ్మం: అడవులు అంతరించిపోతూ ఉండటంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, వాతావరణంలో పెనుమార్పులు సంభవించి మానవమనుగడకు ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు, మేధావి వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నా పాలకులు కానీ, సంబంధిత శాఖాధికారులు కానీ పట్టించుకున్న ట్టు లేదు. ఒకప్పుడు దట్టమైన అడ వులుగా చెప్పబడిన దండకారణ్యంలోని సరిహద్దు భద్రాచలంలో అడవులు అంతరించి ఎడారిగా మారు తుంది. ఆదివాసీల అమాయకత్వం, జీవనశైలిలో మా ర్పులు, నాగరికుల స్వార్ధం అత్యాశతో భద్రాచలం అడవులు స్మగ్లర్లకు అడ్డాలుగా మారాయి. అటవీ శాఖలో వేళ్ళూనుకుపోయిన అవినీతి స్మగ్లర్లకు కోట్లు గడించి పెడుతుంది. అక్రమార్జనకు అలవాటుపడిన అటవీ సిబ్బందికి రెండువైపులా ఆదాయం వస్తుంది. అడవులు అంతరించిపోతున్నాయని, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ అడవులు పెంచాలని కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పథకాలకు అవినీతి చీడ పట్టింది. ఏజన్సీ ప్రాంతాల్లో ఉమ్మడి అటవీ యాజమాన్యం పేరుతో ప్రవేశపెట్టిన పథకాల్లో అవినీతిని ప్రశ్నించే అధికారే కరువైయ్యాడు.

ఆదివాసీల భాగ స్వామ్యంతో చేపట్టిన పథకాలు వారిలోని అమాయక త్వం అధికారులకు అక్షయపాత్రగా మారింది. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన రాజకీయపార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు, పబ్బం గడుపుకునేందుకు ఆదివాసీలను రెచ్చగొట్టి వేలాది ఎకరాల అడవిని నరికించి పోడు భూములుగా మార్చారు. కంచె చేనుమేసిన చందంగా కాపాడాల్సిన అటవీశాఖ అడవులు అంతరించిపోవడంలో ప్రధాన భూమిక పోషిస్తుందనే విమర్శలున్నాయి. క్రిందిస్థా యి సిబ్బందిలో చిత్తశుద్ది కొరత ఉందనే ఆరోపణలు న్నాయి. చర్ల రేంజ్‌ పరిధిలో ‘మన్యసీమ‌’ సేకరించిన వివరాల ప్రకారం 36,42,729 హెక్టార్లు అడవి ఉండ గా ప్రస్తుతం ఆ స్థాయిలో అడవి లేదని తెలుస్తుంది. అధికారులు సైతం సరైన లెక్కలు చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికారులు లెక్కల్లో పేర్కొన్న భూమిలో 80,205 హెక్టార్లు టేకు ప్లాంటేషన్‌ ఉండగా వివిధ కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో కోల్పోయిన భూమికి ప్రత్యామ్నాయంగా చర్ల రేంజ్‌ పరిధిలో 16,479 హెక్టార్లు ఉంది. ఈ లెక్కల్లో అతి తక్కువ స్థాయిలో మా ర్పులు చేర్పులు జరిగి ఉండవచ్చును. ప్రస్తుతం టేకు ప్లాంటేషన్‌ తో కలిపి చర్ల రేంజ్‌లో 36,59,208 హెక్టార్లు ఉన్నట్లు తెలుస్తుంది.
రేంజ్‌ పరిధిలో ఉమ్మడి అటవీయాజమాన్యం ద్వారా లెనిన్‌ కాలనీ, కొయ్యూరు, ఇప్పులబాడువా, సూరవీడు కాలనీ, బోధాపురం, సిఎఫ్‌ ఎం ద్వారా సింగసముద్రం 12,250 సూరవీడుకాలనీ 105, మంగువాయి కాలనీ 103, ముకునూరుపాలెం 108 మొత్తం 57,050 హెక్టార్లు అడవులు ఉన్నట్లు తెలుస్తుంది. సహజ అడవులు దాదాపు అంతరించి పోయినట్టుతెలుస్తుంది. మిగిలిఉన్న అడవులు కాపాడటం అటవీశాఖకు సాధ్యం అవుతుం దనేది చెప్పలేం. క్షేత్ర స్థాయిలో కాపాడాల్సిన అధికారులు సిబ్బందిలో మార్పుతోపాటు, వారికి ప్రభుత్వపరంగా పూర్తి అధికారాలు అండదండలు అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం 33 శాతం అడవులుం డాల్సిన చోట కేవలం 11 శాతం అడవులున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఈ శాతం మరింత తగ్గి ఉండవచ్చునని భావిస్తున్నారు.
అడవులతో పాటు అడవి జంతువులు కూడా పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది. అడవులతో తరతరాలుగా విడదీయ రాని బంధం ఉన్న ఆదివాసీలను మనం అడవిబిడ్డలుగా పిలుస్తుంటాం. అటువంటి వారు తమ ఉనికికి, జీవనా ధారం అయిన అడవులు అంతరించి పోవడంలో ప్రధాన భూమికను వారికి తెలియకుండానే పోషిస్తు న్నారు. కొన్ని స్వార్ధపరశక్తులు అడవి బిడ్డల బలహీనతలను ఆసరా చేసుకుని వారి చేతనే అడవులను నరికించి సొమ్ము చేసుకుంటు న్నాయి. అడవి అంతరించిపోవ డంతో అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించిన ఆది వాసీల జీవన విధానంలో మార్పు చోటుచేసుకుంది. అడవి జంతువుల వేటకూడా పెరిగిపోయింది. ఒకప్పుడు ఆదివాసీలు ప్రత్యేక కాలంలో ఉమ్మడిగా వెళ్ళి వేటాడి తెచ్చిన జంతువుల మాంసాన్ని ఎండబెట్టుకుని, కాలాన్ని అనుసరించి తినే సంసృ్కతి ఉండేది. అవసరానికి మించి జంతు వులను వేటాడేవారు కాదు. నేడు ఆ పద్దతికి స్వస్తి పలికారు.

మారిన జీవన విధానంతో అడవి జంతువులను విచ్చలవిడిగా వేటాడి హతమార్చుతూ విక్రయా లు మొదలుపెట్టారు. గిరిజనేతరు ల పాత్ర ఇందులో ప్రధానం. ఏజన్సీ ప్రాంతాల్లో వారంలో కనీసం రెండు రోజులు అడవి మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రముఖులు సైతం ఖాతాదారులుగా ఉన్నారంటే వాళ్ళబాధ్యత ఏపాటిదో అర్ధమౌతుంది. వేసవికాలంలో నీటికోసం జంతువులు వాగులు, వంకలు వద్ద నీరు లభించే ప్రాంతాలకు రాత్రివేళల్లో వస్తుండటాన్ని గమనించిన వేటగాళ్ళు మాటువేసి జంతువు లను హతమారుస్తున్నారు. మానవ మనుగడకు జీవనాధారం ప్రకృ తి ప్రసాదించిన అడవులు కాపా డాలన్న ఆలోచన మనిషిలో లేకుండా పో తుంది. ఇదే పరిస్థి తి కొనసాగితే మానవ మను గడ ప్రశ్నార్ధకం గా మారే ప్ర మాదం ఉం ది. బ్రతకడా నికి శతకోటి మార్గాలున్న అడవులను అమ్ముకుని గడించాలను కునే వారి ఆట కట్టించిన నాడు… తమ తల్లిలాంటి అడ విని కాపాడుకోవాలనే ఆలోచన ఆదివాసీల్లో కలిగిన నాడు.. ఏ ఉద్యమాలు అవసరం లేదు. ఆ రోజు రావాలి. అందుకు ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి.

Advertisement

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.