విద్యార్ధుల గోళీలాట!

కనుమరుగౌతున్న గోళీలాటా క్రీడను వెలుగులోకి తీసుకొచ్చేందుకు విశాఖలో కొన్ని సంస్థలు నడుంబిగించాయి. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు గోళీలాటా పేరుతో పోటీలు నిర్వహించాయి. ఓ వృత్తంలో ఉన్న పెద్ద గోళీని దూరం నుంచి చిన్న గోళీతో ఎక్కువ సార్లు కొట్టిన విద్యార్థులను విజేతలుగా ప్రకటించారు. ఈ పోటీల్లో పన్నెండు పాఠశాలలకు చెందిన డెబ్భై మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ గోళీల ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

రైతన్నలు విలవిల!

సాగు భూములు బీడుగా మారుతుండడంపట్ల రైతన్నలు విలవిలలాడుతున్నారు. వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలంలోని ఎలుకుర్తి, రాంపూర్‌ల మీదుగా దేవాదుల ఎత్తిపోతల కాలువ నిర్మాణం జరుగుతోంది. దీని ఫలితంగా చెరువుల కింద ఉన్న ఆయకట్టు భూములకు నీరందడం లేదు. తమ భూములు బీడులుగా మారుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. దేవాదుల పుణ్యమా అని భూములు కోల్పోయి రోడ్డున పడ్డామని బాధిత రైతులు వాపోతున్నారు.

అవినీతి సర్పంచ్‌!

అక్రమాలు జరగకుండా అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిదే అవకతవకలకు పాల్పడుతున్నాడు. వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛన్లలో కోతపెడుతూ జేబులు నింపుకుంటున్నాడు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జరుగుతున్న అవినీతి భాగోతంపై బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో సర్పంచ్‌ జెతురాం నాయక్‌ పెన్షన్ల పంపిణీలో అవినీతికి పాల్పడుతున్నాడు. అర్హులైన వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వమిస్తున్న రెండువంద రూపాయల పింఛన్లో వంద రూపాయలను స్వాహ చేస్తున్నాడు. దాదాపు డెబ్బైమంది మహిళలు తమకు నాలగు నెలలుగా ప్రభుత్వ సహాయం [...]

రాజకీయ పక్షాలతో ఇసి భేటీ

సార్వత్రిక ఎన్నికల ప్రకటన ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశం ఉండడంతో రాష్ట్రంలో ఏర్పాట్లపై ఇసి కసరత్తు ప్రారంభించింది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో సిఇసి సుబ్బారావు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో మూడు దశల్లో పోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఇప్పటికే సూచించారు. ప్రజలకు ఓటు హక్కు కల్పించడం తమ బాధ్యత అని సమావేశానంతరం సుబ్బారావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎలక్ర్టానిక్ వోటింగ్ మిషన్‌లపై అవగాహన కల్పించేలా చర్యలు చేపడ్తామన్నారు. పోస్టాఫీసుల ద్వారా రెండు [...]

సాంఘిక భద్రతకు అభయ హస్తం

అమెరికా వంటి దేశాలలో సాంఘిక భద్రత కింద నెలవారి ఫించను ఇస్తారట. అక్కడి ప్రజలందరికి ఇలాంటి సదుపాయం ఉంటుందట. కాని మన దేశంలో ఇంకా అలాంటి పరిస్థితి రాలేదు. జనాభా అధికంగా ఉండడం, నిరుద్యోగం, అభివృద్ది ఇంకా ఆశించని స్థాయిలో లేకపోవడం, మన ప్రభుత్వాలు అ స్థాయిలోకి రాకపోవడం తదితర కారణాలవల్ల మన వద్ద అలాంటి స్కీములు లేవు. పైగా ఒక వేళ అలాంటి స్కీములు ఏర్పాటు కావాలంటే సంబంధిత పౌరులు కూడా అందుకు కంట్రిబ్యూట్ చేయాల్సి [...]

ఎన్‌కౌంటర్లపై సం’చలనాత్మక’ తీర్పు

మానవ సమాజంలో హత్య అన్నది ఒక దారుణమైన ఘటన. జీవించే హక్కు అందరికి ఉంటుంది. కాని కొందరు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అరాచకాలకు పాల్పడుతున్నారు. అది చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు కావచ్చు. లేదా చట్టాన్ని ధిక్కరిస్తున్న తీవ్రవాదులు, ఇతర నేరగాళ్లు కావచ్చు. ఎవరు చేసినా అది తప్పే. అయితే పోలీసు పదకోశంలో ఎన్ కౌంటర్ అనే పదానికి చాల ప్రాముఖ్యత ఉంది. ఎన్ కౌంటర్ అంటే ఏమిటి? ఒక తీవ్రమైన నేరానికి పాల్పడిన వారు లేదా [...]

‘మహా’ పెండలం!

అమలాపురం: సాధారణంగా పెండలం మొక్క ఐదు నుంచి పదిహేను కేజీల వరకు దిగుబడి ఇస్తుంది. ఐతే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారంలో వెంకట్రాజు అనే రైతు ఇంట్లో 70 కిలోల బరువు పెరిగిన పెండలం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో ఆ కుటుంబ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దుంప పెరిగేందుకు తను ఎరువులు, కంపోస్ట్ వంటివి మాత్రమే వాడానని ప్రత్యేకించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేస్తున్నాడు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరిన్ని అద్భుతాలు [...]

కడప జిల్లాలో ఎండిపోతున్న పచ్చని పొలాలు!

కడప: జిల్లాలో పచ్చని పొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సాగునీరు, తాగునీరు కరవుతోంది. వీటన్నింటికి గండికోట టన్నెల్‌ గండికొడుతోంది. కడప జిల్లా మైలవరం మండలంలో కృష్ణా జలాలను గండికోట జలాశయానికి తరలించేందుకు సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. కొండప్రాంతాలలో ఉన్న నేలనూతల, లింగాపురం గ్రామాల గిరిజన రైతులు తక్కువగా పంట పొలాలను సాగు చేసుకుంటున్నారు. సొరంగ మార్గం నిర్మాణం వల్ల బోరుబావుల్లో నీరు ఇంకిపోయింది. తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే నత్తనడకన సాగుతున్న [...]

తిరుమలలో మద్యం అమ్మకాలు!

తిరుపతి: ప్రపంచ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో నిషేధిత వస్తువులు నిరంతరంగా సరఫరా అవుతున్నాయి. అక్రమ వ్యవహారాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విజిలెన్స్ అధికారులు చెప్పడం మినహా పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమ కార్యకలాపాలు యదేచ్ఛగా సాగుతున్నాయి. పదే పదే భక్తులను సోదాల పేరిట తీవ్ర ఇబ్బందులకు గురిచేసే టి.టి.డి. విజిలెన్స్ అధికారులు అక్రమ కార్యకలాపాలపై నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్ సమీపాన 80 మద్యం బాటిళ్లు, రెండు [...]

కరువు జిల్లాలో మూఢ నమ్మకాలు!

అనంతపురం: కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో పేదలు ఇంకా మూఢ నమ్మకాలపై ఆధారపడి జీవిస్తున్నారు. తమ పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి సైతం శునక విగ్రహానికి పూజలు చేస్తున్నారంటే వారు మూఢ నమ్మకాలను ఎంత బలంగా విశ్వసిస్తున్నారో ఇట్టె అర్థమవుతుంది. హిందూపురంలోని ఎస్‌.సడ్లపల్లిలో బెంగళూరు రోడ్డు పక్కనవున్న శునక విగ్రహానికి దశాబ్దాల చరిత్ర ఉంది. గతంలో ఈ గ్రామంలో ఉన్న ఓ సాధువు చిన్న చితక వైద్యం చేసేవాడు. ఆయన పెంపుడు కుక్క [...]

Follow

Get every new post delivered to your Inbox.