రాష్ట్రంలో నీలి చిత్రాల సిడీలు ఎక్కడబడితే అక్కడ ఈజీగా దొరకడంతో యువత పెడదారి పడుతోంది. బిఎఫ్‌లు చూస్తూ, శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న విద్యార్ధులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాలేజీకి వెళ్ళాల్సిన విద్యార్ధులు పెడదోవ పట్టకుండా రక్షించేందుకు మహిళా యాక్షన్ చర్యలు చేపట్టింది. విశాఖ నగరంలో అనేక వీడియో పార్లర్లు, సీడీ షాపు సెంటర్లు బ్లూ ఫిలింలకు అడ్డాలుగా మారుతున్నాయి. మార్కెట్‌లో పుస్తకాలు దొరికినంత ఈజీగా ఈ నీలి చిత్రాలు దొరకడంతో విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన ఈ దాడిలో బూతు సినిమాలు చూస్తున్న నలుగురు డిగ్రీ విద్యార్ధులను పట్టుకున్నారు. దీంతో విసుకు పోయిన మహిళా యాక్షన్ నీలి చిత్రాలకు బ్రేకు వేయడానికి పోరాటానికి దిగింది. తాము చేపేట్టిన ఈ పోరుకు తప్పనిసరిగ్గా మంచి ఫలితాలు వస్తాయని మహిళా యాక్షన్ భావిస్తోంది. కేవలం పోలీసుల మీదే ఈ పని పెట్టకుండా ప్రజల సహకారం కూడా తీసుకుంటామని, తల్లిదండ్రులను చైతన్య పరిచి విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామంటున్నారు. మహిళా యాక్షన్‌కు శ్రీకారం చుట్టిన పోరాటానికి తమ వంతుగా చేయూతనిచ్చి సహకరిస్తామని మహిళా సంఘాలు భరోసా ఇస్తున్నాయి.
ఫిబ్రవరి 7, 2009...13:40
బ్లూ ఫిలిం అడ్డాలుగా వీడియో పార్లర్లు!
Jump to Comments