వద్దన్నా.. వరి వైపే మొగ్గు!

కడెం: ఎస్సారెస్పీ నుంచి సదర్‌మాట్‌కు విడుదలైన నీటిని కేవలం ఆరుతడి పంటల సాగు కోసమే వినియోగించాలని ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడు, అధికారులు కోరినప్పటికీ ఆయకట్టుదారుల్లో అధికులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. కాలువ ద్వారా వస్తున్న నీటితో నారుమళ్లు పోసుకుని, వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. కడెం, ఖానాపూర్‌ మండలాల్లో ఒకరిని చూసి ఒకరు వరిసాగుకే మొగ్గుతున్నారు. నీరు వస్తుందో లేదోనని ఇన్ని రోజులు వేచి చూసిన రైతులు ఎస్సారెస్పీ నుంచి సదర్‌మాట్‌కు నీరు విడుదలవడంతో విత్తనాలు తెచ్చుకుని [...]

పులిమడుగులో మద్య నిషేధం!

ఉట్నూరు: ఉట్నూరు మండలం పులిమడుగు గ్రామంలో కొంత కాలంగా యువకులు మద్యానికి బానిసలవుతున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఈ క్రమంలో స్థానిక అంజనేయ యూత్‌కు సంబంధించిన సభ్యులు మంగళవారం సర్పంచి ఆడే దత్తారాం, ఎంపీపీ ఆడే ధన్‌లాల్‌ల సమక్షంలో సమావేశం నిర్వహించారు. గ్రామంలో మద్యపానం, గుట్కా తినడాన్ని బహిష్కరించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. మద్యం సేవిస్తే రూ. 5వేలు, అమ్మినవారికి రూ.10వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సారా తయారుచేసేవారి పేర్లను ఎక్సైజ్‌ అధికారుల [...]

ఆదిమ గిరిజనుల ప్రత్యేక పూజలు

ఇంద్రవెల్లి: పుష్యమాసంలో గోండులు, కోలాంలు, ప్రధాన జాతి ఆదిమ గిరిజనులు తమ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. పుష్య మాసం ప్రారంభం నుంచి ముగిసేవరకు కాలినడకతో ప్రయాణిస్తూ పూజలు చేయడం వీరి అనవాయితీ. గిరిజనుల తెగలో ఎవరైనా మృతి చెందితే వారి పేరుతో కర్మకాండ (గోండిభాషలో తూమ్‌)ను ఈ మాసంలో నిర్వహిస్తారు. ఇలా చేస్తే మరణించిన గిరిజనులు దేవతల్లో కలిసిపోతారని వారి నమ్మకం. తమతో పాటు కొత్తగా వివాహమైన నూతన వధువరులకు దేవుళ్ల నుంచి ఆశీస్సులు అందుతాయని [...]

కు.ని. లక్ష్యసాధన గగనమే..!!

ఆదిలాబాద్‌: జనాభా పెరగకుండా నియంత్రించాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని పీహెచ్‌సీల వారీగా లక్ష్యాలు కేటాయిస్తూ శస్త్ర చికిత్సలు చేసుకున్నవారితో పాటు, అందుకు ప్రోత్సహించిన వారికి సైతం ప్రభుత్వం పారితోషకాలను అందిస్తోంది. అయినా గత ఐదేళ్లుగా కు.ని. లక్ష్యం నీరుగారిపోతోంది. వైద్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమవుతోంది. జిల్లాలోని లక్ష్య సాధన తీరుపై ప్రత్యేక కథనం.  జిల్లా వ్యాప్తంగా 66 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉండగా జనాభా 26లక్షలు(2001 [...]

13 సంవత్సరాల అజ్ఞాతం నుంచి…!

ఆదిలాబాద్‌: సుదీర్ఘకాలం తరువాత మరో మావోయిస్టు కీలకనేత జిల్లా పోలీసులకు లొంగిపోయాడు. పదమూడు సంవత్సరాల అజ్ఞాత జీవితం విడిచి లొంగిపోయిన దార్శనాల లచ్చన్న(35) మావోయిస్టుల్లో సీనియర్‌ నేత. ఈయన ఆరుకేసుల్లో నిందితుడు. ఏరియా కమిటీ సభ్యునితోపాటు, దళకమాండర్‌గా పని చేశాడు. ఈమేరకు మంగళవారం ఆదిలాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అనిల్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు.  మందమర్రి మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన దార్శనాల లచ్చన్న(35) అలియాస్‌ ప్రభాకర్‌ అలియాస్‌ మసు 1995లో అప్పటి పీపుల్స్‌వార్‌ విప్లవగీతాలకు ఆకర్షితులై [...]

వార్తాపత్రికల ప్రపంచ సదస్సు వాయిదా

పారిస్‌: ఆర్థికసంక్షోభం కారణంగా హైదరాబాద్‌ ఓ అంతర్జాతీయ సదస్సుకు వేదికగా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. మార్చి 22 నుంచి 25 వరకూ హైదరాబాద్‌లో నిర్వహించదలచిన తమ వార్షిక సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని పారిస్‌లోని ‘ప్రపంచ వార్తాపత్రికల సంఘం’ (వాన్‌) ప్రతినిధి మంగళవారం ప్రకటించారు. దీనికి కారణం ప్రపంచ ఆర్థికసంక్షోభమేనని పేర్కొన్నారు. 100 దేశాలకు చెందిన 18,000 వార్తాపత్రికలకు, వార్తాసంస్థలకు, విలేకర్ల సంఘాలకు ప్రాతినిధ్యం వహించే వాన్‌ ఏటా ఏదో ఒక నగరంలో సదస్సు నిర్వహిస్తుంది.

శివారు గ్రామాల విద్యుద్ధీకరణ

సిరిసిల్ల: మూడేళ్లుగా సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) నిరీక్షిస్తున్న రాజీవ్‌ గ్రామీణ విద్యుద్ధీకరణ యోజన పథకం ఎట్టకేలకు సిరిసిల్ల డివిజన్‌లో అమలు కానుంది. ఈ పథకం కింద సెస్‌కు రూ.5.30కోట్లు మంజూరయ్యాయి.  తొమ్మిది మండలాల్లో.. సిరిసిల్ల డివిజన్‌లోని సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, చందుర్తి, కోనరావుపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట మండలాల్లోని శివారు పల్లెలు, కాలనీలు సమస్యలతో సతమతమవుతున్నాయి. నిరుపేదల గుడిసెలకు, విద్యుత్తు లైన్లుఅందుబాటులో లేక సెస్‌ విద్యుత్తు సర్వీసులు మంజూరు చేయడంలేదు. పేదల గృహాలు [...]

రైతుకు గుబులు పుట్టిస్తున్న రబీ

కరీంనగర్: కోటి ఆశలతో రబీలో సేద్యం మొదలు పెట్టిన రైతన్న అడుగడుగునా అవరోధాలనే ఎదుర్కునే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఆరుగాలం కష్టం కళ్లాల్లో పంట రూపంలో రైతులు కళ్ల చూడాలంటే అష్టకష్టాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి తప్పేట్లు లేదు. విత్తనాలు, ఎరువుల విషయంలో కొంత ఇబ్బంది పడుతున్న రైతన్నలకు అర్ధరాత్రి విద్యుత్తు సరఫరా మరింత ఇబ్బందులకు లోను చేయనుంది. కరెంట్‌ కొరత.. సరఫరాలో అంతరాయాలు రైతును ఉక్కిరి బిక్కిరి చేయనున్నాయి. ఇవన్నీ ఒక ఎత్త్తెతే లో-ఓల్టేజీ సమస్య మరోవైపు రైతులను [...]

కొత్తకొండ జాతరలో నిఘా కెమెరాలు!

హుజూరాబాద్‌: కొత్తకొండ జాతరలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు హుజూరాబాద్‌ డీఎస్పీ నాగేశ్వర్‌రావు అన్నారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర ఉత్సవాలను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జాతరకు రెండు కిలో మీటర్ల దూరంలో జీపులు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ కోసం నాలుగు పక్కలా స్థలం గుర్తించారు. ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ కోసం [...]

‘క్రాంతి’.. భ్రాంతియేనా..!?

ప్రొద్దుటూరు: ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తున్నా పశుక్రాంతి లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. బ్యాంకులు, ఖజానా, పశుసంవర్థక శాఖల మధ్య సమన్వయలోపం.. ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టంగా లేకపోవడం వంటి కారణాలతో వచ్చిన లక్షలాది రూపాయల నిధులు మురిగిపోతున్నాయి.  * పశుసంవర్థక శాఖ 2008 అక్టోబరు నివేదిక ప్రకారం జిల్లాలో 11,32,452 గొర్రెలున్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కాని రైతులకు, పనిలేని వ్యవసాయ కూలీలకు కాస్త ఊరట కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం ‘జీవక్రాంతి’ పథకానికి రూపకల్పన చేసింది. [...]

Follow

Get every new post delivered to your Inbox.