ఖమ్మం: అత్యధికంగా బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించినజిల్లాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నెడ్ క్యాప్ ద్వారా రాష్ట్రస్థాయిలో అమలు చేస్తున్న తరగని ఇంధన వనరుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విరివిగా బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానాన్ని పొందుతోంది. నెడ్ క్యాప్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పి.రెడ్డి హైదరాబాద్ నుంచి కలెక్టర్‌కు ఈ బహుమతిని పంపారు. జిల్లాలో నెడ్ క్యాప్ [...]
జనవరి 2009 నుండి టపాలు
జనవరి 26, 2009
ఎన్‌కౌంటర్ కాదది… ఆదివాసీల ఊచకోత
భద్రాచలం: ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగారం అడవుల్లో జరిగింది ఎన్‌కౌంటర్ కాదని, అది ఆదివాసీల భారీ ఊచకోత అని 4 రాష్ట్రాల పౌరహక్కుల సంఘాలు ఆరోపించాయి. ఆంధ్రా, కర్నాటక, న్యూఢిల్లీ, నాగాలాండ్‌కు చెందిన వివిధ పౌరహక్కుల సంఘాల నేతలు రెండు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సింగారం అడవుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు భద్రాచలంలో ఆదివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ [...]
జనవరి 26, 2009
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా పెద్దన్న
అనంతపురం: ప్రప్రథమంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గం ఎంపికైంది. ఈ మేరకు ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో ఆ సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య ముఖ్యఅతిథిగా హాజరైన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎస్.పెద్దన్న, ప్రధాన కార్యదర్శిగా బి.శంకర్, సహాధ్యక్షుడిగా ఎస్.రామలింగం, కోశాధికారిగా కె.శంకరయ్య, గౌరవాధ్యక్షుడిగా ఎం.అంజయ్యలు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎం.జగదీష్, బి.సుధాకర్‌నాయక్, కె.తిరుపాల్‌నాయక్, హెచ్.హనుమంతు, ఎం.రామకృష్ణ, ఎస్.రామానాయక్, కార్యదర్శులుగా [...]
జనవరి 25, 2009
మావోయిస్టులకు ఎఎస్పీ తరుణ్‌జోషి పిలుపు
నేరడిగొండ: లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని ఎఎస్పీ తరుణ్‌జోషి అజ్ఞాత మావోయిస్టులకు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ నిర్వహించిన మావోయిస్టు, సానుభూతిపరుల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. పోలీసులు ప్రజల కోసం ఉన్నారని, సంఘ వ్యతిరేకశక్తులకు గ్రామీణులు ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. ఎవరిని బాధించాలనే ఆలోచన పోలీసులకు లేదన్నారు. ఈసందర్భంగా అజ్ఞాత మావోయిస్టుల కుటుంబసభ్యులకు దుస్తులు, బియ్యం పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సీఐ చంద్రప్రభు, ఎస్సైలు జబ్బార్, పురుషోత్తంచారిలు, ఎంపీపీ సాబ్లె ప్రేంసింగ్, జడ్పీటీసీ పండరి, స్థానిక సర్పంచి సజన్, [...]
జనవరి 25, 2009
అచేతనావస్థలో భర్త.. మంచంపట్టిన కూతురు!
మంచిర్యాల: కూతురి అనారోగ్యం.. ఏడు పదులు దాటి అచేతన స్థితిలో ఉన్న భర్త.. ఎదుగుతున్న కూతురి పిల్లలు.. ఆపై కుటుంబ పోషణ భారం.. ఇవన్ని తలకుమించిన భారమై.. మానసికంగా కుంగిపోయిన ఓ వృద్ధురాలు శనివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంచిర్యాలలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… మంచిర్యాల మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన సాగే గోపాల్‌రావు, పద్మావతి(60) దంపతులు మంచిర్యాలలో స్థిరపడ్డారు. 15 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా చాకుంట గ్రామానికి చెందిన [...]