తెలుగు భాషకు ప్రాచీనహోదా సాధించిన మనం, ఆ భాష మృతభాషగా మారిపోకుండా కాపాడుకోవాలని కేంద్రమంత్రి దగ్గుపాటి పురందరేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వం కిన్నెర ఆర్ట్ ధియేటర్స్ హైదరాబాద్ త్యాగరాయగానసభలో నిర్వహిస్తున్న తెలుగుభాషా మహోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని ఎలుగెత్తిచాటాలని సభలో పాల్గొన్న వక్తలంతా కోరారు. ఉషాగాయత్రి శిష్యులు ప్రదర్శించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
Advertisement
Filed under: వార్తలు




