దక్షిణ కోస్తాలో చురుగ్గా రుతుపవనాలు

విశాఖపట్నం: పెను తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారి కర్నాటక, రాయలసీమలకు ఆనుకుని మారుమూల తమిళనాడులో కేంద్రీకతమై వుంది. ఇది వాయువ్య దిశగా పయనించి మరింత బలహీనపడుతుంది. ఇదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.  వీటి ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, తెలంగాణాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.  గడిచిన ఇరవై నాలుగు [...]

భారత్‌ కమెండోల సాహసాలకు చిత్తైన నరహంతకులు

నారిమన్‌ హౌజ్‌ను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించిన కొద్ది సేపటికే  ట్రెడెండ్ హోటల్‌లోని బంధీలకు కూడా విముక్తి లభించింది. నలబై గంటల పాటు సైన్యం సాగించిన పోరుతో టెర్రరిస్టులు తలవంచక తప్పలేదు. ముంబయ్ మహానగరంలో అత్యంత ఖరీదైన బిజినెస్‌ సెంటర్‌ నారిమన్ పాయింట్ దగ్గర అరేబియా మహా సముద్రానికి అభిముఖంగా ఠీవిగా కన్పించేదే ఓబెరాయ్ హోటల్.  వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చే బిగ్‌ షాట్స్‌ అంతా ఎక్కువగా ఇందులో బస చేస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ [...]

బెంగుళూరు – మచిలీపట్నంల మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి బెంగళూరు, మచిలీపట్నాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పనబాక కృష్ణయ్య తెలిపారు. కాచిగూడ-బెంగళూరు (రైల్‌ నెంబర్‌ 789) స్పెషల్‌: డిసెంబర్‌ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో కాచిగూడ నుంచి రాత్రి 9.55కు బయల్దేరి మర్నాటి రోజు మధ్యాహ్నం 12.10కు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (నెం.790) డిసెంబర్‌ 8, 15, 22, 29, జనవరి 5, [...]

తాజ్‌లో ముగిసిన పోరు

ముంబయి: తాజ్‌హోటల్లో రాత్రినుంచి కొనసాగుతున్న ఆపరేషన్‌ సైక్లోన్‌ కార్యక్రమం ఎట్టకేలకు ఈరోజు ఉదయం ముగిసింది. ముగ్గురు తీవ్రవాదులు అంతమయ్యారు. హోటల్‌ కమెండోల హస్తగతం అయింది. తాజ్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లోని కారిడార్లలో ఈరోజు ఉదయం ఆరుగంటలనుంచి భీకర పోరు కొనసాగింది. కాల్పులు, మంటలతో ఆ ప్రాంతం యుద్ధభూమిని తలపించింది. కమెండోలు అన్ని వైపులనుంచి చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో కమెండోలు ఓ శవాన్ని బయటకు విసిరివేశారు. మరో ఇద్దరు తీవ్రవాదులు కూడా మృతి చెందారని తెలుస్తోంది. [...]

5 గురు ఉగ్రవాదుల హతం : తనిఖీ ముమ్మరం

ముంబయి: తాజ్‌ హోటల్‌లో ఆపరేషన్‌ పూర్తిగా ముగిసినట్లు కాదని హోటల్‌ మొత్తం గాలించి అన్ని విషయాలు ధృవీకరించుకున్నాకే ఇది ముగిసినట్లు భావించాలని ఎన్‌ఎస్‌జీ చీఫ్‌ దత్‌ తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటివరకు చేసిన దాడుల గురించి తెలిపారు. తాజ్‌లో ముగ్గురు తీవ్రవాదులు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని, కొన్ని గ్రెనేడ్లు, ఏకే 47లు కూడా తమకు దొరికాయని ఆయన చెప్పారు. తమ కమాండర్‌ ఒకరు వారితో పోరాడుతూ వీరమరణం పొందారని చెప్పారు. ఇంకా [...]

అమరవీరులకు తుది నివాళులు

ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు : తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు జాతి తుది నివాళులు అర్పించింది. మాలెగాం పేలుళ్ల దర్యాప్తులో చురుకైన పాత్ర పోషించిన ఐపీఎస్‌ అధికారి, ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే తాజ్‌ వద్ద తీవ్రవాదులను ఏరివేసే కార్యక్రమంలో వారు పేల్చిన తూటాలకు నేలకొరిగారు. ముంబయిలో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరిగాయి. పెద్దసంఖ్యలో ప్రజలు, బంధువులు, పోలీసులు, మంత్రులు, రాజకీయనాయకులు ఆయన నివాసానికి వచ్చేసి ఘనంగా నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలో తీవ్రవాదులతో పోరులో ప్రాణాలు [...]

ఉగ్రవాదుల్లో ఒకరు తాజ్‌లో ట్రైనీ చెఫ్‌

ముంబయి: తాజ్‌ సంఘటనలో ఉద్రిక్తత కొంత అదుపులోకి రాగానే పలు దిగ్భ్రాంతికరమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజ్‌పై జరిగిన దాడిలో పాల్గొన్న తీవ్రవాదుల్లో ఒకరు 10 నెలలుగా అక్కడే ట్రైనీ చెఫ్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏడాదిగా తీవ్రవాదులు దాడికి ప్రణాళిక రచించారని, అందుకు అనుగుణంగా ముందే హోటల్‌లో చేరి అన్ని దారులు, ఇతర విషయాలు బాగా తెలుసుకున్నారని తెలుస్తోంది. గత రాత్రి నౌకా దళ అధికారి ఒకరు మాట్లాడుతూ తామే మొదటిసారి లోపలికి వెళ్లి గందరగోళానికి [...]

ఐఎస్‌ఐ చీఫ్‌ రావటంలేదు

ఇస్లామాబాద్‌: ముంబై పేలుళ్ల దర్యాప్తులో భారత్‌కు సహకరించేందుకు రానున్న ఐఎస్‌ఐ చీఫ్‌ షాజా పాషా రావటంలేదు.ఈ విషయాన్ని గత అర్థరాత్రి అనంతరం పాక్‌ ప్రకటించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సూచనమేరకు పాషాను పంపేందుకు పాక్‌ మొదట అంగీకారం తెలిపింది. ఈ మేరకు చర్చించేందుకు గత రాత్రి దేశాధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ, చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ జనరల్‌ పర్వేజ్‌ ఖయానీ, ప్రధాని యూసఫ్‌ రజా గిలానీలు సమావేశమయ్యారు. వీరి భేటీ రాత్రి 1.30 వరకు జరిగింది. అనంతరం వారు [...]

తెలంగాణ బాణిని అడ్డుకునేందుకే వైఎస్ సమైఖ్య వాణి!

ముందు వాస్తవాలేమిటో తెలుసుకో. ఆతర్వాత నీ చిత్తం వచ్చినట్లుగా వక్రీకరించు అని ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వెయిన్ అంటారు. మన నేతలు మాత్రం వాస్తవాలు ఉన్నా, లేకున్నా తమకు అనుకూలమైన రీతిలో అన్వయించుకోవడమో, లేక వక్రీకరించుకోవడమో చేయడంలో సిద్ధహస్తులవుతున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈ విద్యలో ఆరితేరినట్లే కన్పిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి వైఖరీతో ఉందో ఏమోకాని తెలంగాణపై వై.ఎస్. తనదైన శైలిలో స్పందిస్తూ కొత్త రాజకీయానికి నాందీ పలుకుతున్నారనే చెప్పాలి. వై.ఎస్. తన ఢిల్లీ, [...]

కలవరపరుస్తోన్న ముంబై మారణహోమం!

ముంబైలో ఉగ్రవాద దాడుల నేపధ్యంలో అమెరికా నిఘావిభాగం అలర్ట్‌ అయ్యింది. వైట్ హౌస్, వరల్డ్ ట్రేడ్‌ సెంటర్ల వద్ద భద్రతను మరింత పెంచింది. హోటల్స్, రిసార్ట్స్ పోలీసుల డేగకన్నులలో ఉన్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పత్రికలు ప్రధాన శీర్షికల్లో ఈ ఘటనను ప్రచారం చేసి అంతర్జాతీయంగా ఉగ్రవాదుల సమస్యను ప్రపంచానికి తెలియజేశాయి. వాణిజ్య రాజధాని ముంబై మీద ఒక్కసారిగా ఉగ్రవాదులు విసిరిన పంజా   ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉగ్రవాదంపై పోరుకి మొదట్లోనే బహిరంగంగా మద్దతిచ్చిన దేశంగా [...]

Follow

Get every new post delivered to your Inbox.