బాలల హక్కులు


భారదేశంలో గల 30 కోట్ల  పిల్లలలో చాలామంది పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదుగుదల లోపించి ఉంటున్నారు.  ఆర్ధిక, సామాజిక స్ధితిగతుల కారణంగా ఈ అభివృద్ధి లోపం ఏర్పడుతున్నమాట వాస్తవం. రేపటి జ్ఞానవంతమైన శక్తిమంతమైన భారతదేశాన్ని చూడడానికి నేటి బాలల అవసరాలను తీర్చే సమయమాసన్నమైనది.

భారతదేశ  స్వాతంత్ర్యనంతర శకంలో నిశ్చతమైన నిబద్ధతతో కూడిన భారతదేశ రాజ్యాంగ విహిత చట్టనిబంధనల ద్వారా బాలల కొరకు అవకాశాలను, కార్యాచరణ విధానాలను మరియు కార్యక్రమాలను రూపొందించింది. ఈ శతాబ్దపు చివరి దశకంలో ఆకస్మిక సాంకేతిక అభివృద్ధిలో భాగంగా ఆరోగ్యం, పోషణ, విద్య అంశాలతో బాటు ప్రాదేశిక విషయాలతో నూతన ఆకాంక్షలను కల్పించే అవకాశాలను పిల్లలకు కల్పించడం.

భారతదేశంలోగల ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధలు, ఇతర  రంగాల వారు కలసి కట్టుగా పని చేయడంలో అసాధారణ సమస్యలు గల బాలలపై ప్రముఖంగా దృష్ఠిని కేంద్రికరించడం. పిల్లలు – చాకిరికి సంబంధించిన విషయాలలో బాల కార్మికుల సమస్యలను పరిష్కరించడం లింగ వివక్షను రూపుమాపడం, వీధి బాలలను ఉద్దరించడం, ప్రత్యేక అవసరాలుగల బాలలకు కావలసిన అవసరాలను తీర్చడం. అంతే గాకుండా పిల్లలు చదువుకోవడం వారి ప్రాధమిక హక్కు కావునా దానిని కాపాడడం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.