హైదరాబాద్: ఇంట్లో వారిని నియంత్రించుకోలేని వారు ప్రజలకు ఏం సేవ చేస్తారని చిరంజీవిని ఉద్దేశించి తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు రోజా వ్యాఖ్యానించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని, తన వ్యక్తిత్వమేంటో అందరికీ తెలుసన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రోజా తీవ్రంగా స్పందించారు. ీఎవరి వ్యక్తిత్వం ఏంటో, ప్రవర్తన ఏంటో, పద్ధతులేంటో ప్రజలందరికీ తెలుసు. నన్ను అంటున్నవాళ్లు మహిళలకు అన్యాయాలు చేసిన దాఖలాలున్నాయి. ఆడపిల్లలను మోసం చేసిన వారికి, ఆడపిల్లలపై దాడికి పురిగొల్పిన వారికి కచ్చితంగా మహిళలే బుద్ధి చెబుతారు” అని హెచ్చరించారు.
Filed under: వార్తలు




