న్యూఢిల్లీ : అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. రిక్టరు స్కేలుపై 5.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం దాటికి నిద్ర మత్తులో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి లేచి వీధుల్లోకి చేరుకున్నారు. అయితే ఈ భూకంపం వలన ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. భూకంప కేంద్రం 10.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 91.7 డిగ్రీల తూర్పురేఖాంశం మీద ఉన్నట్లు భారత భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. మరోసారి ప్రకంపనలు సంభ వించే అవకాశం ఉన్నదని వెల్లడించారు.
Filed under: వార్తలు




